కీర్తనలు Chapter 86

For English

Read కీర్తనలు Chapter 86 Online

Read కీర్తనలు Chapter 86 online from the Holy Bible. This chapter is part of the Book of కీర్తనలు in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of కీర్తనలు and the Holy Bible online.

Choose a Chapter

కీర్తనలు 86

అధ్యాయం 86

1. యెహోవా, నేను దీనుడను దరిద్రుడను చెవియొగ్గి నాకుత్తరమిమ్ము

2. నేను నీ భక్తుడను నా ప్రాణము కాపాడుము. నా దేవా, నిన్ను నమ్ముకొనియున్న నీ సేవకుని రక్షిం పుము.

3. ప్రభువా, దినమెల్ల నీకు మొఱ్ఱపెట్టుచున్నాను నన్ను కరుణింపుము

4. ప్రభువా, నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయుము.

5. ప్రభువా, నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడవు నీకు మొఱ్ఱపెట్టువారందరియెడల కృపాతిశయము గల వాడవు.

6. యెహోవా, నా ప్రార్థనకు చెవి యొగ్గుము నా మనవుల ధ్వని ఆలకింపుము,

7. నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొఱ్ఱ పెట్టె దను.

8. ప్రభువా, నీవు మహాత్మ్యముగలవాడవు ఆశ్చర్యకార్య ములు చేయువాడవు నీవే అద్వితీయ దేవుడవు.

9. ప్రభువా, దేవతలలో నీవంటివాడు లేడు నీ కార్యములకు సాటియైన కార్యములు లేవు.

10. నీవు సృజించిన అన్యజనులందరును వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు నీ నామమును ఘనపరచుదురు

11. యెహోవా, నేను నీ సత్యము ననుసరించి నడచు కొనునట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము.

12. నా పూర్ణహృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తు తులు చెల్లించెదను నీ నామమును నిత్యము మహిమపరచెదను.

13. ప్రభువా, నా దేవా, నాయెడల నీవు చూపిన కృప అధికమైనది పాతాళపు అగాధమునుండి నా ప్రాణమును తప్పించి యున్నావు.

14. దేవా, గర్విష్ఠులు నా మీదికి లేచియున్నారు బలాత్కారులు గుంపుకూడి నా ప్రాణము తీయ జూచుచున్నారు వారు నిన్ను లక్ష్యపెట్టనివారై యున్నారు.

15. ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములుగల దేవుడవు ధీర్ఘశాంతుడవు కృపాసత్యములతో నిండినవాడవు

16. నాతట్టు తిరిగి నన్ను కరుణింపుము నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము నీ సేవకురాలి కుమారుని రక్షింపుము.

17. యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్నాదరించు చున్నావు నా పగవారు చూచి సిగ్గుపడునట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనుపరచుము.

About కీర్తనలు Chapter 86

Read కీర్తనలు Chapter 86 online from the Holy Bible. This chapter is part of the Book of కీర్తనలు in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: కీర్తనలు
Chapter: 86
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading కీర్తనలు. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading కీర్తనలు Chapter 86 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is కీర్తనలు Chapter 86?

కీర్తనలు Chapter 86 is part of the Book of కీర్తనలు in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete కీర్తనలు Chapter 86 online for free with easy chapter navigation.

More Chapters from కీర్తనలు

  1. కీర్తనలు Chapter 92
  2. కీర్తనలు Chapter 129
  3. కీర్తనలు Chapter 100
  4. కీర్తనలు Chapter 80
  5. కీర్తనలు Chapter 42
  6. కీర్తనలు Chapter 21
  7. కీర్తనలు Chapter 149

Explore More from పాత నిబంధన

  1. ద్వితీయోపదేశకాండము Chapter 17
  2. 2 దినవృత్తాంతములు Chapter 30
  3. యెహోషువ Chapter 6
  4. ఆదికాండము Chapter 14
  5. 2 రాజులు Chapter 1
  6. యెషయా Chapter 62
  7. యెషయా Chapter 25

Related Chapters & Readings

  1. కీర్తనలు Chapter 15
  2. యోహాను Chapter 11
  3. యోబు Chapter 38
  4. దానియేలు Chapter 3
  5. 1 కొరింథీయులకు Chapter 1
  6. యోనా Chapter 1
  7. 1 కొరింథీయులకు Chapter 9
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *