కీర్తనలు Chapter 118

For English

Read కీర్తనలు Chapter 118 Online

Read కీర్తనలు Chapter 118 online from the Holy Bible. This chapter is part of the Book of కీర్తనలు in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of కీర్తనలు and the Holy Bible online.

Choose a Chapter

కీర్తనలు 118

అధ్యాయం 118

1. యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము…… నిలుచును ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి

2. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందురు గాక.

3. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశ స్థులు అందురు గాక.

4. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులుగలవారు అందురు గాక.

5. ఇరుకునందుండి నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని విశాలస్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను

6. యెహోవా నా పక్షమున నున్నాడు నేను భయ పడను నరులు నాకేమి చేయగలరు?

7. యెహోవా నా పక్షము వహించి నాకు సహకారియై యున్నాడు నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను.

8. మనుష్యులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు.

9. రాజులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు.

10. అన్యజనులందరు నన్ను చుట్టుకొనియున్నారు యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము చేసెదను.

11. నలుదిశలను వారు నన్ను చుట్టుకొనియున్నారు యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము చేసెదను.

12. కందిరీగలవలె నామీద ముసిరి యున్నారు ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించి పోయిరి యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసెదను.

13. నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి యెహోవా నాకు సహాయము చేసెను.

14. యెహోవా నా దుర్గము నా గానము ఆయన నాకు రక్షణాధారమాయెను.

15. నీతిమంతుల గుడారములలోరక్షణనుగూర్చిన ఉత్సాహ సునాదము వినబడును యెహోవా దక్షిణహస్తము సాహస కార్యములను చేయును.

16. యెహోవా దక్షిణహస్తము మహోన్నత మాయెను యెహోవా దక్షిణహస్తము సాహసకార్యములను చేయును.

17. నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివ రించెదను.

18. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు.

19. నేను వచ్చునట్లు నీతి గుమ్మములు తీయుడి నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించెదను.

20. ఇది యెహోవా గుమ్మము నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు.

21. నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చి యున్నావు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను.

22. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను.

23. అది యెహోవావలన కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యము

24. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము దీనియందు మనము ఉత్సహించి సంతోషించెదము.

25. యెహోవా, దయచేసి నన్ను రక్షించుము యెహోవా, దయచేసి అభివృద్ధి కలిగించుము.

26. యెహోవాపేరట వచ్చువాడు ఆశీర్వాద మొందును గాక యెహోవా మందిరములోనుండి మిమ్ము దీవించు చున్నాము.

27. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు నను గ్రహించియున్నాడు ఉత్సవ బలిపశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి.

28. నీవు నా దేవుడవు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను నీవు నా దేవుడవు నిన్ను ఘనపరచెదను.

29. యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి.

About కీర్తనలు Chapter 118

Read కీర్తనలు Chapter 118 online from the Holy Bible. This chapter is part of the Book of కీర్తనలు in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: కీర్తనలు
Chapter: 118
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading కీర్తనలు. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading కీర్తనలు Chapter 118 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is కీర్తనలు Chapter 118?

కీర్తనలు Chapter 118 is part of the Book of కీర్తనలు in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete కీర్తనలు Chapter 118 online for free with easy chapter navigation.

More Chapters from కీర్తనలు

  1. కీర్తనలు Chapter 92
  2. కీర్తనలు Chapter 100
  3. కీర్తనలు Chapter 129
  4. కీర్తనలు Chapter 80
  5. కీర్తనలు Chapter 42
  6. కీర్తనలు Chapter 21
  7. కీర్తనలు Chapter 149

Explore More from పాత నిబంధన

  1. పరమగీతము Chapter 2
  2. కీర్తనలు Chapter 90
  3. యోవేలు Chapter 1
  4. నిర్గమకాండము Chapter 13
  5. యెహోషువ Chapter 19
  6. సంఖ్యాకాండము Chapter 5
  7. కీర్తనలు Chapter 30

Related Chapters & Readings

  1. మత్తయి Chapter 28
  2. 1 రాజులు Chapter 6
  3. కీర్తనలు Chapter 78
  4. 1 సమూయేలు Chapter 2
  5. ప్రకటన గ్రంథము Chapter 11
  6. 1 రాజులు Chapter 14
  7. ఆదికాండము Chapter 21
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *