కీర్తనలు Chapter 94

For English

Read కీర్తనలు Chapter 94 Online

Read కీర్తనలు Chapter 94 online from the Holy Bible. This chapter is part of the Book of కీర్తనలు in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of కీర్తనలు and the Holy Bible online.

Choose a Chapter

కీర్తనలు 94

అధ్యాయం 94

1. యెహోవా, ప్రతికారముచేయు దేవా, ప్రతికారముచేయు దేవా, ప్రకాశింపుము

2. భూలోక న్యాయాధిపతీ లెమ్ము గర్విష్టులకు ప్రతిఫలమిమ్ము

3. యెహోవా, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు?

4. వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు దోషము చేయువారందరు బింకములాడు చున్నారు.

5. యెహోవా చూచుటలేదు యాకోబు దేవుడు విచారించుటలేదు అనుకొని

6. యెహోవా, వారు నీ ప్రజలను నలుగగొట్టుచున్నారు నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు

7. విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు తండ్రిలేనివారిని హతముచేయుచున్నారు.

8. జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి బుద్ధిహీనులారా, మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు?

9. చెవులను కలుగచేసినవాడు వినకుండునా? కంటిని నిర్మించినవాడు కానకుండునా?

10. అన్యుజనులను శిక్షించువాడు మనుష్యులకు తెలివి నేర్పువాడు దండింపకమానునా?

11. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి యున్నది.

12. యెహోవా, నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు.

13. భక్తిహీనులకు గుంట త్రవ్వబడువరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు.

14. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు.

15. నీతిని స్థాపించుటకై న్యాయపుతీర్పు జరుగును యథార్థహృదయులందరు దాని ననుసరించెదరు.

16. దుష్టులమీదికి నా పక్షమున ఎవడు లేచును? దోషము చేయువారికి విరోధముగా నా పక్షమున ఎవడు నిలుచును?

17. యెహోవా నాకు సహాయము చేసియుండని యెడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి యుండును.

18. నాకాలు జారెనని నేననుకొనగా యెహోవా, నీ కృప నన్ను బలపరచుచున్నది.

19. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ జేయుచున్నది.

20. కట్టడవలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు పొందుకలుగునా?

21. దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయుటకై వారిమీద పడుదురు దోషులని నిర్దోషులకు మరణము విధించుదురు.

22. యెహోవా నాకు ఎత్తయిన కోట నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము.

23. ఆయన వారిదోషము వారిమీదికి రప్పించును వారి చెడుతనమునుబట్టి వారిని సంహరించును. మన దేవుడైన యెహోవా వారిని సంహరించును.

About కీర్తనలు Chapter 94

Read కీర్తనలు Chapter 94 online from the Holy Bible. This chapter is part of the Book of కీర్తనలు in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: కీర్తనలు
Chapter: 94
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading కీర్తనలు. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading కీర్తనలు Chapter 94 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is కీర్తనలు Chapter 94?

కీర్తనలు Chapter 94 is part of the Book of కీర్తనలు in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete కీర్తనలు Chapter 94 online for free with easy chapter navigation.

More Chapters from కీర్తనలు

  1. కీర్తనలు Chapter 92
  2. కీర్తనలు Chapter 128
  3. కీర్తనలు Chapter 100
  4. కీర్తనలు Chapter 47
  5. కీర్తనలు Chapter 42
  6. కీర్తనలు Chapter 30
  7. కీర్తనలు Chapter 21

Explore More from పాత నిబంధన

  1. యోబు Chapter 31
  2. 2 రాజులు Chapter 17
  3. ద్వితీయోపదేశకాండము Chapter 13
  4. న్యాయాధిపతులు Chapter 12
  5. 2 దినవృత్తాంతములు Chapter 33
  6. నిర్గమకాండము Chapter 2
  7. ఆదికాండము Chapter 42

Related Chapters & Readings

  1. హబక్కూకు Chapter 3
  2. సామెతలు Chapter 7
  3. మార్కు Chapter 12
  4. కీర్తనలు Chapter 88
  5. 1 తిమోతికి Chapter 6
  6. యెహెజ్కేలు Chapter 34
  7. ఆదికాండము Chapter 44
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *