ప్రకటన గ్రంథము Chapter 7

For English

Read ప్రకటన గ్రంథము Chapter 7 Online

Read ప్రకటన గ్రంథము Chapter 7 online from the Holy Bible. This chapter is part of the Book of ప్రకటన గ్రంథము in the New Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of ప్రకటన గ్రంథము and the Holy Bible online.

Choose a Chapter

ప్రకటన గ్రంథము 7

అధ్యాయం 7

1. అటుతరువాత భూమియొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచియుండి, భూమిమీదనైనను సముద్రముమీదనైనను ఏ చెట్టుమీదనైనను గాలి వీచ కుండునట్లు భూమియొక్క నాలుగు దిక్కుల వాయువులను పట్టుకొనియుండగా చూచితిని.

2. మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశనుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగజేయుటకై అధికారముపొందిన ఆ నలుగురు దూతలతో

3. ఈ దూతమేము మా దేవుని దాసులను వారి నొసళ్లయందు ముద్రించువరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను.

4. మరియు ముద్రింపబడినవారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింప బడినవారు లక్ష నలువది నాలుగు వేలమంది.

5. యూదా గోత్రములో ముద్రింపబడినవారు పండ్రెండువేలమంది. రూబేను గోత్రములో పండ్రెండు వేలమంది, గాదు గోత్రములో పండ్రెండు వేలమంది,

6. ఆషేరు గోత్రములో పండ్రెండు వేలమంది, నఫ్తాలి గోత్రములో పండ్రెండు వేలమంది, మనష్షే గోత్రములో పండ్రెండు వేలమంది,

7. షిమ్యోను గోత్రములో పండ్రెండు వేలమంది, లేవి గోత్రములో పండ్రెండు వేలమంది, ఇశ్శాఖారు గోత్రములో పండ్రెండు వేలమంది,

8. జెబూలూను గోత్రములో పండ్రెండు వేలమంది, యోసేపు గోత్రములో పండ్రెండు వేలమంది, బెన్యామీను గోత్రములో పండ్రెండు వేలమంది ముద్రింపబడిరి.

9. అటు తరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై, ఖర్జూరపుమట్టలు చేతపట్టుకొని సింహాసనము ఎదుటను గొఱ్ఱెపిల్లయెదుటను నిలువబడి

10. సింహాసనా సీనుడైన మా దేవునికిని గొఱ్ఱపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి.

11. దేవదూతలందరును సింహాసనముచుట్టును పెద్దలచుట్టును ఆ నాలుగు జీవులచుట్టును నిలువబడియుండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడిఆమేన్‌;

12. యుగయుగములవరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతా స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి; ఆమేన్‌.

13. పెద్దలలో ఒకడుతెల్లని వస్త్రములు ధరించుకొనియున్న వీరెవరు? ఎక్కడనుండి వచ్చిరని నన్ను అడిగెను.

14. అందుకు నేను అయ్యా, నీకే తెలియుననగా అతడు ఈలాగు నాతో చెప్పెనువీరు మహాశ్రమలనుండి వచ్చిన వారు; గొఱ్ఱపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొనిరి.

15. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్లు ఆయన ఆలయ ములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారిమీద కప్పును;

16. వారికి ఇకమీదట ఆకలియైనను దాహమైనను ఉండదు, సూర్యుని యెండయైనను ఏ వడగాలియైనను వారికి తగులదు,

17. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొఱ్ఱపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును.

About ప్రకటన గ్రంథము Chapter 7

Read ప్రకటన గ్రంథము Chapter 7 online from the Holy Bible. This chapter is part of the Book of ప్రకటన గ్రంథము in the New Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: ప్రకటన గ్రంథము
Chapter: 7
Testament: New Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading ప్రకటన గ్రంథము. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading ప్రకటన గ్రంథము Chapter 7 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is ప్రకటన గ్రంథము Chapter 7?

ప్రకటన గ్రంథము Chapter 7 is part of the Book of ప్రకటన గ్రంథము in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete ప్రకటన గ్రంథము Chapter 7 online for free with easy chapter navigation.

More Chapters from కొత్త నిబంధన

  1. 2 పేతురు Chapter 3
  2. హెబ్రీయులకు Chapter 11
  3. మత్తయి Chapter 21
  4. ప్రకటన గ్రంథము Chapter 4
  5. 2 థెస్సలొనీకయులకు Chapter 3
  6. మార్కు Chapter 15
  7. ప్రకటన గ్రంథము Chapter 5

Explore More from ప్రకటన గ్రంథము

  1. ప్రకటన గ్రంథము Chapter 20
  2. ప్రకటన గ్రంథము Chapter 17
  3. ప్రకటన గ్రంథము Chapter 21
  4. ప్రకటన గ్రంథము Chapter 2
  5. ప్రకటన గ్రంథము Chapter 19
  6. ప్రకటన గ్రంథము Chapter 15
  7. ప్రకటన గ్రంథము Chapter 8

Related Chapters & Readings

  1. పరమగీతము Chapter 3
  2. 1 రాజులు Chapter 1
  3. ఆదికాండము Chapter 25
  4. లూకా Chapter 17
  5. యిర్మీయా Chapter 2
  6. యిర్మీయా Chapter 31
  7. యోబు Chapter 26
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *