ప్రకటన గ్రంథము Chapter 20

For English

Read ప్రకటన గ్రంథము Chapter 20 Online

Read ప్రకటన గ్రంథము Chapter 20 online from the Holy Bible. This chapter is part of the Book of ప్రకటన గ్రంథము in the New Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of ప్రకటన గ్రంథము and the Holy Bible online.

Choose a Chapter

ప్రకటన గ్రంథము 20

అధ్యాయం 20

1. మరియు పెద్దసంకెళ్లను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపుచెవిగల యొక దేవదూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని.

2. అతడు ఆదిసర్పమును, అనగా అపవాదియు సాతానును అను ఆ ఘటసర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి,

3. ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను; అటుపిమ్మట వాడు కొంచెము కాలము విడిచి పెట్టబడవలెను.

4. అంతట సింహాసనములను చూచితిని; వాటిమీద ఆసీనులై యుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారముచేయ తమ నొసళ్లయందు గాని చేతులయందు గాని దాని ముద్రవేయించుకొనని వారిని, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రదికినవారై, వెయ్యి సంవత్సరములు క్రీస్తుతోకూడ రాజ్యము చేసిరి

5. ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు కడమ మృతులు బ్రదుక లేదు; ఇదియే మొదటి పునరుత్థానము.

6. ఈ మొదటి పునరుత్థాన ములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు. ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారములేదు; వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.

7. వెయ్యి సంవత్సరములు గడచిన తరువాత సాతాను తానున్న చెరలోనుండి విడిపింపబడును.

8. భూమి నలు దిశలయందుండు జనములను, లెక్కకుసముద్రపు ఇసుకవలె ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగుచేయుటకై వాడు బయలుదేరును.

9. వారు భూమియందంతట వ్యాపించి, పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడివేయగా పరలోకములోనుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను.

10. వారిని మోసపరచిన అపవాది అగ్ని గంధకములుగల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూరమృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు; వారు యుగయుగములు రాత్రింబగళ్లు బాధింపబడుదురు.

11. మరియు ధవళమైన మహా సింహాసనమును దానియందు ఆసీనుడైయున్న యొకనిని చూచితిని; భూమ్యాకాశములు ఆయన సముఖమునుండి పారిపోయెను; వాటికి నిలువ చోటు కనబడకపోయెను.

12. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పు పొందిరి.

13. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళలోకమును వాటి వశముననున్న మృతుల నప్పగించెను; వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పుపొందెను.

14. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను; ఈ అగ్నిగుండము రెండవ మరణము.

15. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడనియెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను.

About ప్రకటన గ్రంథము Chapter 20

Read ప్రకటన గ్రంథము Chapter 20 online from the Holy Bible. This chapter is part of the Book of ప్రకటన గ్రంథము in the New Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: ప్రకటన గ్రంథము
Chapter: 20
Testament: New Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading ప్రకటన గ్రంథము. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading ప్రకటన గ్రంథము Chapter 20 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is ప్రకటన గ్రంథము Chapter 20?

ప్రకటన గ్రంథము Chapter 20 is part of the Book of ప్రకటన గ్రంథము in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete ప్రకటన గ్రంథము Chapter 20 online for free with easy chapter navigation.

More Chapters from కొత్త నిబంధన

  1. 2 పేతురు Chapter 3
  2. లూకా Chapter 13
  3. లూకా Chapter 23
  4. లూకా Chapter 4
  5. యూదా Chapter 1
  6. లూకా Chapter 7
  7. లూకా Chapter 17

Explore More from ప్రకటన గ్రంథము

  1. ప్రకటన గ్రంథము Chapter 16
  2. ప్రకటన గ్రంథము Chapter 18
  3. ప్రకటన గ్రంథము Chapter 14
  4. ప్రకటన గ్రంథము Chapter 2
  5. ప్రకటన గ్రంథము Chapter 11
  6. ప్రకటన గ్రంథము Chapter 6
  7. ప్రకటన గ్రంథము Chapter 19

Related Chapters & Readings

  1. కీర్తనలు Chapter 133
  2. యెహెజ్కేలు Chapter 34
  3. సంఖ్యాకాండము Chapter 11
  4. హెబ్రీయులకు Chapter 5
  5. 2 దినవృత్తాంతములు Chapter 24
  6. యిర్మీయా Chapter 29
  7. కీర్తనలు Chapter 95
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *