ద్వితీయోపదేశకాండము Chapter 10

For English

Read ద్వితీయోపదేశకాండము Chapter 10 Online

Read ద్వితీయోపదేశకాండము Chapter 10 online from the Holy Bible. This chapter is part of the Book of ద్వితీయోపదేశకాండము in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of ద్వితీయోపదేశకాండము and the Holy Bible online.

Choose a Chapter

ద్వితీయోపదేశకాండము 10

అధ్యాయం 10

1. ఆ కాలమందు యెహోవామునుపటి వాటి వంటి రెండు రాతిపలకలను నీవు చెక్కుకొని కొండ యెక్కి నా యొద్దకు రమ్ము. మరియు నీవు ఒక కఱ్ఱమందసమును చేసికొనవలెను.

2. నీవు పగులగొట్టిన మొదటి పలకల మీదనున్న మాటలను నేను ఈ పలకలమీద వ్రాసిన తరువాత నీవు ఆ మందసములో వాటిని ఉంచవలెనని నాతో చెప్పెను.

3. కాబట్టి నేను తుమ్మకఱ్ఱతో ఒక మందసమును చేయించి మునుపటి వాటివంటి రెండు రాతి పలకలను చెక్కి ఆ రెండు పలకలను చేత పట్టుకొని కొండ యెక్కితిని.

4. ఆ సమాజదినమున ఆ కొండమీద అగ్ని మధ్యనుండి తాను మీతో పలికిన పది ఆజ్ఞలను మునుపు వ్రాసినట్టు యెహోవా ఆ పలకలమీద వ్రాసెను. యెహోవా వాటిని నాకిచ్చిన తరువాత నేను తిరిగి కొండ దిగివచ్చి

5. ​నేను చేసిన మందసములో ఆ పలకలను ఉంచి తిని. యెహోవా నాకాజ్ఞాపించినట్లు వాటిని దానిలో నుంచితిని.

6. ​ఇశ్రాయేలీయులు యహకానీయులదైన బెయేరోతునుండి బయలుదేరి మోసేరుకు వచ్చినప్పుడు అక్కడ అహరోను చనిపోయి పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఎలియాజరు అతనికి ప్రతిగా యాజకు డాయెను.

7. అక్కడనుండి వారు గుద్గోదకును గుద్గోద నుండి నీటివాగులు గల దేశమైన యొత్బాతాకును ప్రయా ణము చేసిరి.

8. ​నేటివరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసమును మోయుటకు, యెహోవా సన్నిధిని నిలు చుటకును, ఆయనను సేవించి ఆయన నామమునుబట్టి దీవించుటకును, లేవి గోత్రపువారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనెను.

9. కాబట్టి తమ సహో దరులతోపాటు లేవీయులు స్వాస్థ్యమునైనను పొంద లేదు. నీ దేవుడైన యెహోవా వారితో చెప్పినట్లు యెహోవాయే వారికి స్వాస్థ్యము.

10. ​నేను మునుపటివలె నలువది పగళ్లును నలువది రాత్రులును కొండమీద ఉండగా యెహోవా ఆ కాలమున నా మనవి ఆలకించి నిన్ను నశింప జేయుట మానివేసెను.

11. ​మరియు యెహోవా నాతో ఇట్లనెనుఈ ప్రజలు నేను వారికిచ్చెదనని వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమున ప్రవేశించి స్వాధీన పరచుకొనునట్లు నీవు లేచి వారి ముందర సాగుమని చెప్పెను.

12. ​కాబట్టి ఇశ్రాయేలూ, నీ దేవుడైన యెహోవాకు భయ పడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు, ఆయనను ప్రేమించి, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణాత్మతోను సేవించి,

13. నీ మేలుకొరకు నేడు నేను నీకాజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అను సరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు?

14. చూడుము; ఆకాశము, మహాకాశము, భూమియు, అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే.

15. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారియందు ఆనంద పడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను.

16. కాబట్టి మీరు సున్నతిలేని మీ హృదయమునకు సున్నతి చేసికొని యికమీదట ముష్కరులు కాకుండుడి

17. ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమప్రభువునై యున్నాడు. ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు. ఆయన నరులముఖమును లక్ష్యపెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు.

18. ఆయన తలిదండ్రులు లేనివానికిని విధవరాలికిని న్యాయము తీర్చి, పరదేశియందు దయ యుంచి అన్నవస్త్రముల ననుగ్రహించువాడు.

19. మీరు ఐగుప్తు దేశములో పరదేశులై యుంటిరి గనుక పరదేశిని జాలి తలచుడి.

20. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను.

21. ఆయనే నీకు కీర్తనీయుడు. నీవు కన్నులార చూచు చుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే.

22. నీ పితరులు డెబ్బది మందియై ఐగుప్తునకు వెళ్లిరి. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశనక్షత్రములవలె నిన్ను విస్తరింపజేసి యున్నాడు.

About ద్వితీయోపదేశకాండము Chapter 10

Read ద్వితీయోపదేశకాండము Chapter 10 online from the Holy Bible. This chapter is part of the Book of ద్వితీయోపదేశకాండము in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: ద్వితీయోపదేశకాండము
Chapter: 10
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading ద్వితీయోపదేశకాండము. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading ద్వితీయోపదేశకాండము Chapter 10 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is ద్వితీయోపదేశకాండము Chapter 10?

ద్వితీయోపదేశకాండము Chapter 10 is part of the Book of ద్వితీయోపదేశకాండము in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete ద్వితీయోపదేశకాండము Chapter 10 online for free with easy chapter navigation.

More Chapters from ద్వితీయోపదేశకాండము

  1. ద్వితీయోపదేశకాండము Chapter 27
  2. ద్వితీయోపదేశకాండము Chapter 14
  3. ద్వితీయోపదేశకాండము Chapter 33
  4. ద్వితీయోపదేశకాండము Chapter 24
  5. ద్వితీయోపదేశకాండము Chapter 22
  6. ద్వితీయోపదేశకాండము Chapter 19
  7. ద్వితీయోపదేశకాండము Chapter 4

Explore More from పాత నిబంధన

  1. 1 దినవృత్తాంతములు Chapter 1
  2. ద్వితీయోపదేశకాండము Chapter 3
  3. కీర్తనలు Chapter 118
  4. సంఖ్యాకాండము Chapter 5
  5. కీర్తనలు Chapter 25
  6. యెహెజ్కేలు Chapter 39
  7. ఆదికాండము Chapter 22

Related Chapters & Readings

  1. 2 సమూయేలు Chapter 11
  2. యోబు Chapter 34
  3. యెషయా Chapter 54
  4. యిర్మీయా Chapter 14
  5. ద్వితీయోపదేశకాండము Chapter 13
  6. యోహాను Chapter 5
  7. 1 దినవృత్తాంతములు Chapter 23
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *