ద్వితీయోపదేశకాండము Chapter 27

For English

Read ద్వితీయోపదేశకాండము Chapter 27 Online

Read ద్వితీయోపదేశకాండము Chapter 27 online from the Holy Bible. This chapter is part of the Book of ద్వితీయోపదేశకాండము in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of ద్వితీయోపదేశకాండము and the Holy Bible online.

Choose a Chapter

ద్వితీయోపదేశకాండము 27

అధ్యాయం 27

1. మోషేయు ఇశ్రాయేలీయుల పెద్దలును ప్రజలతో ఇట్లనిరినేడు నేను మీకు విధించుచున్న ధర్మమును మీరాచరింపవలెను.

2. మీ దేవుడైన యెహోవా మీకిచ్చు చున్న దేశమున ప్రవేశించుటకు మీరు యొర్దాను దాటు దినమున మీరు పెద్దరాళ్లను నిలువ బెట్టి వాటిమీద సున్నము పూసి

3. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నీవు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పాలు తేనెలు ప్రవహించు దేశమున ప్రవేశించుటకు నీవు ఏరు దాటినతరువాత ఈ ధర్మ శాస్త్రవాక్యములన్నిటిని వాటిమీద వ్రాయవలెను.

4. మీరు ఈ యొర్దాను దాటిన తరువాత నేను నేడు మీ కాజ్ఞాపించినట్లు ఈ రాళ్లను ఏబాలు కొండమీద నిలువబెట్టి వాటిమీద సున్నము పూయవలెను.

5. అక్కడ నీ దేవుడైన యెహో వాకు బలిపీఠమును కట్టవలెను. ఆ బలిపీఠమును రాళ్లతో కట్టవలెను; వాటిమీద ఇనుప పనిముట్టు పడకూడదు.

6. చెక్కని రాళ్లతో నీ దేవుడైన యెహోవాకు బలిపీఠమును కట్టి దానిమీద నీ దేవుడైన యెహోవాకు దహనబలుల నర్పింపవలెను.

7. ​మరియు నీవు సమాధానబలుల నర్పించి అక్కడ భోజనము చేసి నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను.

8. ​ఈ విధికి సంబంధించిన వాక్యము లన్నిటిని ఆ రాళ్లమీద బహు విశదముగా వ్రాయవలెను.

9. ​మరియు మోషేయు యాజకులైన లేవీయులును ఇశ్రాయేలీయులందరితో ఇట్లనిరిఇశ్రాయేలీయులారా, మీరు ఊరకొని ఆలకించుడి.

10. నేడు మీరు మీ దేవుడైన యెహోవాకు స్వజనమైతిరి గనుక మీ దేవు డైన యెహోవా మాట విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గైకొనవలెను.

11. ఆ దినమందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించిన దేమనగా మీరు యొర్దాను దాటినతరువాత షిమ్యోను లేవి యూదా ఇశ్శాఖారు యోసేపు

12. బెన్యామీను గోత్ర ములవారు ప్రజలనుగూర్చి దీవెనవచనములను పలుకుటకై గెరిజీము కొండమీద నిలువవలెను.

13. రూబేను గాదు ఆషేరు జెబూలూను దాను నఫ్తాలి గోత్రములవారు శాప వచనములను పలుకుటకై ఏబాలు కొండమీద నిలువ వలెను.

14. అప్పుడు లేవీయులు యెహోవాకు హేయముగా శిల్పిచేతులతో

15. మలి చిన విగ్రహమునేగాని పోతవిగ్రహమునేగాని చేసి చాటున నుంచువాడు శాపగ్రస్తుడని యెలుగెత్తి ఇశ్రా యేలీయులందరితోను చెప్పగాఆమేన్‌ అనవలెను.

16. తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయు వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్‌ అన వలెను.

17. తన పొరుగువాని సరిహద్దురాయిని తీసివేయు వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్‌ అనవలెను.

18. గ్రుడ్డివాని త్రోవను తప్పించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్‌ అనవలెను.

19. పరదేశికేగాని తండ్రిలేనివానికేగాని విధవరాలికే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్‌ అనవలెను.

20. తన తండ్రి భార్యతో శయనించువాడు తన తండ్రి కోకను విప్పినవాడు గనుక వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్‌ అనవలెను.

21. ఏ జంతువుతోనైనను శయనించువాడు శాపగ్రస్తు డని చెప్పగా ప్రజలందరుఆమేన్‌ అనవలెను.

22. తన సహోదరితో, అనగా తన తండ్రికుమార్తెతో గాని తన తల్లికుమార్తెతో గాని శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్‌ అనవలెను.

23. తన అత్తతో శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్‌ అనవలెను.

24. చాటున తన పొరుగువానిని కొట్టువాడు శాప గ్రస్తు డని చెప్పగా ప్రజలందరుఆమేన్‌ అనవలెను.

25. నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచము పుచ్చు కొనువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్‌ అనవలెను.

26. ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనక పోవుటవలన వాటిని స్థిరపరచనివాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్‌ అనవలెను.

About ద్వితీయోపదేశకాండము Chapter 27

Read ద్వితీయోపదేశకాండము Chapter 27 online from the Holy Bible. This chapter is part of the Book of ద్వితీయోపదేశకాండము in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: ద్వితీయోపదేశకాండము
Chapter: 27
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading ద్వితీయోపదేశకాండము. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading ద్వితీయోపదేశకాండము Chapter 27 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is ద్వితీయోపదేశకాండము Chapter 27?

ద్వితీయోపదేశకాండము Chapter 27 is part of the Book of ద్వితీయోపదేశకాండము in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete ద్వితీయోపదేశకాండము Chapter 27 online for free with easy chapter navigation.

More Chapters from ద్వితీయోపదేశకాండము

  1. ద్వితీయోపదేశకాండము Chapter 24
  2. ద్వితీయోపదేశకాండము Chapter 4
  3. ద్వితీయోపదేశకాండము Chapter 23
  4. ద్వితీయోపదేశకాండము Chapter 14
  5. ద్వితీయోపదేశకాండము Chapter 2
  6. ద్వితీయోపదేశకాండము Chapter 33
  7. ద్వితీయోపదేశకాండము Chapter 32

Explore More from పాత నిబంధన

  1. నెహెమ్యా Chapter 3
  2. ఆమోసు Chapter 4
  3. ద్వితీయోపదేశకాండము Chapter 11
  4. కీర్తనలు Chapter 25
  5. 2 సమూయేలు Chapter 2
  6. యిర్మీయా Chapter 10
  7. న్యాయాధిపతులు Chapter 7

Related Chapters & Readings

  1. సామెతలు Chapter 17
  2. యోహాను Chapter 21
  3. 1 దినవృత్తాంతములు Chapter 23
  4. కీర్తనలు Chapter 45
  5. ఆదికాండము Chapter 26
  6. యెహెజ్కేలు Chapter 41
  7. రోమీయులకు Chapter 10
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *