హోషేయ Chapter 13

For English

Read హోషేయ Chapter 13 Online

Read హోషేయ Chapter 13 online from the Holy Bible. This chapter is part of the Book of హోషేయ in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of హోషేయ and the Holy Bible online.

Choose a Chapter

హోషేయ 13

అధ్యాయం 13

1. ఎఫ్రాయిము మాటలాడినప్పుడు భయము కలిగెను; అతడు ఇశ్రాయేలువారిలో తన్ను గొప్ప చేసికొనెను; తరువాత బయలు దేవతనుబట్టి అపరాధియై అతడు నాశన మొందెను.

2. ఇప్పుడు వారు పాపము పెంపుచేయుదురు, తమకు తోచినట్టు వెండితో విగ్రహములను పోతపోయు దురు, అదంతయు పనివారు చేయు పనియే, వాటికి బలు లను అర్పించువారుదూడలను ముద్దు పెట్టుకొనుడని చెప్పు దురు.

3. కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘము వలెను పెందలకడ గతించు ప్రాతఃకాలపు మంచువలె నుందురు; కళ్లములోనుండి గాలి యెగురగొట్టు పొట్టు వలెను, కిటకీలోగుండ పోవు పొగవలె నుందురు.

4. మీరు ఐగుప్తు దేశములోనుండి వచ్చినది మొదలుకొని యెహోవా నగు నేనే మీ దేవుడను; నన్ను తప్ప నీవు ఏ దేవునిని ఎరుగవు, నేను తప్ప రక్షకుడును లేడు.

5. మహా యెండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించినవాడను నేనే.

6. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తిపొందిరి; తృప్తిపొంది గర్వించి నన్ను మరచిరి.

7. కాబట్టి నేను వారికి సింహమువంటివాడనైతిని; చిరుతపులి మార్గమున పొంచియున్నట్లు నేను వారిని పట్టుకొన పొంచియుందును.

8. పిల్లలు పోయిన యెలుగుబంటి యొకనిమీద పడు నట్టు నేను వారిమీద పడి వారి రొమ్మును చీల్చివేయు దును; ఆడుసింహము ఒకని మింగివేయు నట్లు వారిని మింగివేతును; దుష్టమృగములు వారిని చీల్చివేయును.

9. ఇశ్రాయేలూ, నీ సహాయకర్తనగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసికొనుచున్నావు.

10. నీ పట్టణ ములలో దేనియందును నీకు సహాయము చేయకుండ నీ రాజు ఏమాయెను? రాజును అధిపతులను నామీద నియమించుమని నీవు మనవి చేసికొంటివిగదా; నీ అధిపతులు ఏమైరి?

11. కాగా కోపము తెచ్చుకొని నీకు రాజును నియమించితిని; క్రోధముకలిగి అతని కొట్టివేయు చున్నాను.

12. ఎఫ్రాయిము దోషము నాయొద్ద ఉంచబడి యున్నది, అతని పాపము భద్రము చేయబడియున్నది.

13. ప్రసూతి వేదనలు కలిగినట్టుగా అతనికి వేదనపుట్టును, పిల్లపుట్టు సమయమున బయటికి రాని శిశువైనట్టుగా అతడు బుద్ధిలేనివాడై వృద్ధికి రాడు.

14. ​అయినను పాతాళ వశములోనుండి నేను వారిని విమోచింతును; మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా, నీ విజయ మెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? పశ్చాత్తాపము నాకు పుట్టదు.

15. నిజముగా ఎఫ్రాయిము తన సహోదరు లలో ఫలాభివృద్ధినొందును. అయితే తూర్పుగాలి వచ్చును, యెహోవా పుట్టించు గాలి అరణ్యములోనుండి లేచును; అది రాగా అతని నీటిబుగ్గలు ఎండి పోవును, అతని ఊటలు ఇంకిపోవును, అతని ధననిధులను అతనికి ప్రియమైన వస్తువు లన్నిటిని శత్రువు కొల్లపెట్టును.

16. ​షోమ్రోను తన దేవుని మీద తిరుగుబాటుచేసెను గనుక అది శిక్షనొందును, జనులు కత్తిపాలగుదురు, వారి పిల్లలు రాళ్లకువేసి కొట్టబడుదురు, గర్భిణిస్త్రీల కడుపులు చీల్చబడును.

About హోషేయ Chapter 13

Read హోషేయ Chapter 13 online from the Holy Bible. This chapter is part of the Book of హోషేయ in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: హోషేయ
Chapter: 13
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading హోషేయ. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading హోషేయ Chapter 13 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is హోషేయ Chapter 13?

హోషేయ Chapter 13 is part of the Book of హోషేయ in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete హోషేయ Chapter 13 online for free with easy chapter navigation.

More Chapters from పాత నిబంధన

  1. నిర్గమకాండము Chapter 1
  2. దానియేలు Chapter 10
  3. సామెతలు Chapter 4
  4. జెకర్యా Chapter 4
  5. ఆదికాండము Chapter 1
  6. విలాపవాక్యములు Chapter 3
  7. ప్రసంగి Chapter 12

Explore More from హోషేయ

  1. హోషేయ Chapter 9
  2. హోషేయ Chapter 12
  3. హోషేయ Chapter 5
  4. హోషేయ Chapter 10
  5. హోషేయ Chapter 3
  6. హోషేయ Chapter 7
  7. హోషేయ Chapter 8

Related Chapters & Readings

  1. యెషయా Chapter 4
  2. మత్తయి Chapter 21
  3. కీర్తనలు Chapter 144
  4. కీర్తనలు Chapter 10
  5. మత్తయి Chapter 25
  6. యెహోషువ Chapter 20
  7. కీర్తనలు Chapter 150
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *