నిర్గమకాండము Chapter 27

For English

Read నిర్గమకాండము Chapter 27 Online

Read నిర్గమకాండము Chapter 27 online from the Holy Bible. This chapter is part of the Book of నిర్గమకాండము in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of నిర్గమకాండము and the Holy Bible online.

Choose a Chapter

నిర్గమకాండము 27

అధ్యాయం 27

1. మరియు అయిదు మూరల పొడుగు అయిదు మూరల వెడల్పుగల బలిపీఠమును తుమ్మకఱ్ఱతో నీవు చేయ వలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా నుండవలెను; దాని యెత్తు మూడు మూరలు.

2. దాని నాలుగు మూలలను దానికి కొమ్ములను చేయవలెను; దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను; దానికి ఇత్తడి రేకు పొదిగింప వలెను.

3. దాని బూడిదె ఎత్తుటకు కుండలను గరిటెలను గిన్నెలను ముండ్లను అగ్నిపాత్రలను చేయవలెను. ఈ ఉప కరణములన్నియు ఇత్తడితో చేయవలెను.

4. మరియు వలవంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలెను.

5. ఆ వలమీద దాని నాలుగు మూలలను నాలుగు ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీఠము నడిమివరకు చేరునట్లు దిగువను బలిపీఠము గట్టు క్రింద దాని నుంచవలెను.

6. మరియు బలిపీఠముకొరకు మోతకఱ్ఱలను చేయవలెను. ఆ మోతకఱ్ఱలను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలెను.

7. ఆ మోతకఱ్ఱలను ఆ ఉంగరములలో చొనపవలెను. బలిపీఠమును మోయుటకు ఆ మోతకఱ్ఱలు దాని రెండుప్రక్కల నుండ వలెను.

8. పలకలతో గుల్లగా దాని చేయవలెను; కొండమీద నీకు చూపబడిన పోలికగానే వారు దాని చేయవలెను.

9. మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలెను. కుడివైపున, అనగా దక్షిణదిక్కున ఆవరణముగా నూరు మూరల పొడుగుగలదై పేనిన సన్న నార యవనికలు ఒక ప్రక్కకు ఉండవలెను.

10. దాని యిరువది స్తంభములును వాటి యిరువది దిమ్మలును ఇత్తడివి; ఆ స్తంభముల వంకులును వాటి పెండెబద్దలును వెండివి.

11. అట్లే పొడుగులో ఉత్తర దిక్కున నూరు మూరల పొడుగుగల యవనికలుండ వలెను. దాని యిరువది స్తంభములును వాటి యిరువది దిమ్మలును ఇత్తడివి. ఆ స్తంభముల వంకులును వాటి పెండె

12. పడమటి దిక్కున ఆవరణపు వెడల్పు కొరకు ఏబది మూరల యవనికలుండవలెను; వాటి స్తంభ ములు పది వాటి దిమ్మలు పది.

13. తూర్పువైపున, అనగా ఉదయదిక్కున ఆవరణపు వెడల్పు ఏబది మూరలు.

14. ఒక ప్రక్కను పదునైదు మూరల యవనికలుండవలెను; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు.

15. రెండవ ప్రక్కను పరునైదుమూరల యవనికలుండవలెను; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలును మూడు.

16. ఆవరణపు ద్వారమునకు నీల ధూమ్ర రక్తవర్ణములుగల యిరువది మూరల తెర యుండవలెను. అవి పేనిన సన్ననారతో చిత్రకారుని పనిగా ఉండవలెను; వాటి స్తంభములు నాలుగు వాటి దిమ్మలు నాలుగు.

17. ఆవరణముచుట్టున్న స్తంభములన్నియు వెండి పెండెబద్దలు కలవి; వాటి వంకులు వెండివి వాటి దిమ్మలు ఇత్తడివి.

18. ఆవరణపు పొడుగు నూరు మూరలు; దాని వెడల్పు ఏబదిమూరలు దాని యెత్తు అయిదు మూరలు; అవి పేనిన సన్ననారవి వాటి దిమ్మలు ఇత్తడివి.

19. మందిరసంబంధమైన సేవోపకర ణములన్నియు మేకులన్నియు ఆవరణపు మేకులన్నియు ఇత్తడివై యుండవలెను.

20. మరియు దీపము నిత్యము వెలిగించునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలెనని ఇశ్రాయేలీ యుల కాజ్ఞాపించుము.

21. సాక్ష్యపు మందసము ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులును సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు యెహోవా సన్నిధిని దాని సవరింపవలెను. అది ఇశ్రాయేలీయులకు వారి తరతరములవరకు నిత్యమైన కట్టడ.

About నిర్గమకాండము Chapter 27

Read నిర్గమకాండము Chapter 27 online from the Holy Bible. This chapter is part of the Book of నిర్గమకాండము in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: నిర్గమకాండము
Chapter: 27
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading నిర్గమకాండము. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading నిర్గమకాండము Chapter 27 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is నిర్గమకాండము Chapter 27?

నిర్గమకాండము Chapter 27 is part of the Book of నిర్గమకాండము in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete నిర్గమకాండము Chapter 27 online for free with easy chapter navigation.

More Chapters from నిర్గమకాండము

  1. నిర్గమకాండము Chapter 1
  2. నిర్గమకాండము Chapter 16
  3. నిర్గమకాండము Chapter 32
  4. నిర్గమకాండము Chapter 13
  5. నిర్గమకాండము Chapter 10
  6. నిర్గమకాండము Chapter 8
  7. నిర్గమకాండము Chapter 40

Explore More from పాత నిబంధన

  1. యెహెజ్కేలు Chapter 36
  2. కీర్తనలు Chapter 54
  3. 1 దినవృత్తాంతములు Chapter 13
  4. కీర్తనలు Chapter 59
  5. ఆదికాండము Chapter 18
  6. ఆదికాండము Chapter 14
  7. కీర్తనలు Chapter 51

Related Chapters & Readings

  1. యోబు Chapter 8
  2. మార్కు Chapter 13
  3. 1 కొరింథీయులకు Chapter 15
  4. హోషేయ Chapter 5
  5. యిర్మీయా Chapter 26
  6. కీర్తనలు Chapter 138
  7. ఆదికాండము Chapter 32
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *