ద్వితీయోపదేశకాండము Chapter 25

For English

Read ద్వితీయోపదేశకాండము Chapter 25 Online

Read ద్వితీయోపదేశకాండము Chapter 25 online from the Holy Bible. This chapter is part of the Book of ద్వితీయోపదేశకాండము in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of ద్వితీయోపదేశకాండము and the Holy Bible online.

Choose a Chapter

ద్వితీయోపదేశకాండము 25

అధ్యాయం 25

1. మనుష్యులకు వివాదము కలిగి న్యాయసభకు వచ్చు నప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుని నీతి మంతుడనియు దోషిని దోషియనియు తీర్పు తీర్చవలెను.

2. ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడినయెడల న్యాయాధి పతి వాని పండుకొనబెట్టి వాని నేరముకొలది దెబ్బలు లెక్కపెట్టి తనయెదుట వాని కొట్టింపవలెను.

3. నలువది దెబ్బలు కొట్టింపవచ్చును అంతకు మించకూడదు. వీటి కంటే విస్తారమైన దెబ్బలు కొట్టించినయెడల నీ సహోద రుడు నీ దృష్టికి నీచుడుగా కనబడునేమో.

4. నూర్చెడియెద్దు మూతికి చిక్కము వేయకూడదు.

5. సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానములేక చనిపోయినయెడల చనిపోయిన వాని భార్య అన్యుని పెండ్లిచేసికొనకూడదు; ఆమె పెని మిటి సహోదరుడు ఆమెయొద్దకు పోయి ఆమెను పెండ్లి చేసికొని తన సహోదరునికి మారుగా ఆమెయెడల భర్త ధర్మము జరపవలెను.

6. చనిపోయిన సహోదరుని పేరు ఇశ్రాయేలీయులలోనుండి తుడిచి వేయబడకుండునట్లు ఆమె కను జ్యేష్ఠకుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడుగా ఉండవలెను.

7. అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింప నొల్లనియెడల వాని సహోదరుని భార్య పట్టణపు గవినికి, అనగా పెద్దలయొద్దకు పోయినా పెనిమిటి సహోదరుడు ఇశ్రాయేలీయులలో తన సహోదరునికి పేరు స్థాపింపనని చెప్పి దేవధర్మము చేయ నొల్లడని తెలుపుకొనవలెను.

8. అప్పుడు అతని యూరి పెద్దలు అతని పిలిపించి అతనితో మాటలాడిన తరువాత అతడు నిలువబడిఆమెను పరిగ్రహించుటకు నా కిష్టము లేదనినయెడల అతని సహోదరుని భార్య

9. ఆ పెద్దలు చూచుచుండగా, అతని దాపున పోయి అతని కాలినుండి చెప్పు ఊడదీసి అతని ముఖము నెదుట ఉమి్మవేసితన సహోదరుని యిల్లు నిలుపని మనుష్యునికి ఈలాగు చేయ బడునని చెప్పవలెను.

10. అప్పుడు ఇశ్రాయేలీయులలో చెప్పు ఊడదీయబడిన వాని యిల్లని వానికి పేరు పెట్టబడును.

11. మనుష్యులు ఒకనితో నొకడు పోట్లాడుచుండగా వారిలో ఒకని భార్య వాని కొట్టుచున్నవాని చేతిలోనుండి తన పెనిమిటిని విడిపించుటకు వచ్చి చెయ్యి చాచి వానిమానము పట్టుకొనినయెడల ఆమె చేతిని ఛేదింపవలెను.

12. నీ కన్ను కటాక్షింపకూడదు.

13. హెచ్చుతగ్గులుగల వేరువేరు తూనికె రాళ్లు నీ సంచిలో నుంచుకొనకూడదు.

14. ​హెచ్చుతగ్గులుగల వేరు వేరు తూములు నీ యింట ఉంచుకొనకూడదు.

15. ​నీ దేవు డైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘా యుష్మంతుడవగునట్లు తక్కువవికాని న్యాయమైన తూనికె రాళ్లు నీవు ఉంచుకొనవలెను. తక్కువదికాని న్యాయమైన తూము నీకు ఉండవలెను.

16. ​​ఆలాగు చేయని ప్రతివాడును, అనగా అన్యాయముచేయు ప్రతివాడును నీ దేవుడైన యెహోవాకు హేయుడు.

17. మీరు ఐగుప్తులోనుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసినదానిని జ్ఞాపకము చేసికొనుము. అతడు దేవునికి భయపడక మార్గమున నీ కెదురుగా వచ్చి

18. నీవు ప్రయాసవడి అలసియున్నప్పుడు నీవారిలో నీ వెనుక నున్న బలహీనులనందరిని హతముచేసెను.

19. ​కాబట్టి నీవు స్వాధీనపరచుకొనునట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్య ముగా నీకిచ్చుచున్న దేశములో చుట్టుపట్లనున్న నీ సమస్త శత్రువులను లేకుండచేసి, నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తరువాత ఆకాశము క్రింద నుండి అమాలేకీయుల పేరు తుడిచివేయవలెను. ఇది మరచిపోవద్దు.

About ద్వితీయోపదేశకాండము Chapter 25

Read ద్వితీయోపదేశకాండము Chapter 25 online from the Holy Bible. This chapter is part of the Book of ద్వితీయోపదేశకాండము in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: ద్వితీయోపదేశకాండము
Chapter: 25
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading ద్వితీయోపదేశకాండము. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading ద్వితీయోపదేశకాండము Chapter 25 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is ద్వితీయోపదేశకాండము Chapter 25?

ద్వితీయోపదేశకాండము Chapter 25 is part of the Book of ద్వితీయోపదేశకాండము in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete ద్వితీయోపదేశకాండము Chapter 25 online for free with easy chapter navigation.

More Chapters from ద్వితీయోపదేశకాండము

  1. ద్వితీయోపదేశకాండము Chapter 27
  2. ద్వితీయోపదేశకాండము Chapter 14
  3. ద్వితీయోపదేశకాండము Chapter 33
  4. ద్వితీయోపదేశకాండము Chapter 24
  5. ద్వితీయోపదేశకాండము Chapter 22
  6. ద్వితీయోపదేశకాండము Chapter 19
  7. ద్వితీయోపదేశకాండము Chapter 4

Explore More from పాత నిబంధన

  1. జెకర్యా Chapter 8
  2. కీర్తనలు Chapter 106
  3. 2 దినవృత్తాంతములు Chapter 6
  4. సంఖ్యాకాండము Chapter 2
  5. యిర్మీయా Chapter 15
  6. యెషయా Chapter 54
  7. నిర్గమకాండము Chapter 14

Related Chapters & Readings

  1. యెహెజ్కేలు Chapter 27
  2. యిర్మీయా Chapter 52
  3. యెహెజ్కేలు Chapter 28
  4. యెషయా Chapter 10
  5. యెషయా Chapter 58
  6. హెబ్రీయులకు Chapter 12
  7. సామెతలు Chapter 11
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *