యెహెజ్కేలు Chapter 5

For English

Read యెహెజ్కేలు Chapter 5 Online

Read యెహెజ్కేలు Chapter 5 online from the Holy Bible. This chapter is part of the Book of యెహెజ్కేలు in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of యెహెజ్కేలు and the Holy Bible online.

Choose a Chapter

యెహెజ్కేలు 5

అధ్యాయం 5

1. మరియు నరపుత్రుడా, నీవు మంగలకత్తివంటి వాడిగల కత్తియొకటి తీసికొని నీ తలను గడ్డమును క్షౌరముచేసికొని, త్రాసు తీసికొని ఆ వెండ్రుకలను తూచి భాగములు చేయుము.

2. పట్టణమును ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణములో వాటి మూడవ భాగమును కాల్చి, రెండవ భాగమును తీసి ఖడ్గముచేత హతముచేయు రీతిగా దానిని చుట్టు విసిరికొట్టి మిగిలిన భాగము గాలికి ఎగిరిపోనిమ్ము; నేను ఖడ్గముదూసి వాటిని తరుముదును.

3. అయితే వాటిలో కొన్నిటిని తీసికొని నీ చెంగున కట్టుకొనుము;

4. ​పిమ్మట వాటిలో కొన్నిటిని మరల తీసి అగ్నిలోవేసి కాల్చుము; దానినుండి అగ్ని బయలుదేరి ఇశ్రాయేలు వారినందరిని తగులబెట్టును.

5. ​మరియు ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చెను ఇది యెరూషలేమే గదా, అన్యజనులమధ్య నేను దాని నుంచితిని, దానిచుట్టు రాజ్యములున్నవి.

6. అయితే వారు నా విధులను తృణీకరించి, నా కట్టడల ననుసరింపక దుర్మార్గత ననుసరించుచు, నా విధులను కట్టడలను త్రోసి వేసి తమ చుట్టునున్న అన్యజనుల కంటెను దేశస్థులకంటెను మరి యధికముగా దుర్మార్గులైరి

7. కాబట్టి ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడునా కట్టడల ననుసరింపకయు నా విధులను గైకొనకయు నుండువారై, మీ చుట్టునున్న అన్యజనులకు కలిగియున్న విధులనైనను అనుసరింపక, మీరు మీ చుట్టునున్న దేశస్థులకంటె మరి యధికముగా కఠినహృదయులైతిరి.

8. కావున ప్రభువైన యెహోవానగు నేను నీకు విరోధినైతిని, అన్యజనులు చూచుచుండగా నీకు శిక్ష విధింతును.

9. నీ హేయ కృత్యములను బట్టి పూర్వమందు నేను చేయనికార్యమును, ఇక మీదట నేను చేయబూనుకొనని కార్యమును నీ మధ్య జరిగింతును.

10. కావున నీ మధ్య తండ్రులు తమ కుమారు లను భక్షింతురు, కుమారులు తమ తండ్రులను భక్షింతురు, ఈ ప్రకారము నేను నీకు శిక్ష విధించి నీలో శేషించిన వారిని నలుదిశల చెదరగొట్టుదును.

11. నీ హేయదేవత లన్నిటిని పూజించి నీవు చేసిన హేయమైన క్రియలన్నిటి చేత నా పరిశుద్ధస్థలమును అపవిత్ర పరచితివి గనుక కరుణా దృష్టియైనను జాలియైనను లేక నేను నిన్ను క్షీణింప జేసెదనని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు

12. కరవు వచ్చి యుండగా నీలో మూడవ భాగము తెగులుచేత మరణ మవును, మూడవ భాగము ఖడ్గముచేత నీ చుట్టు కూలును, నేను కత్తి దూసిి మిగిలిన భాగమును నలుదిశల చెదరగొట్టి తరుముదును.

13. నా కోపము తీరును, వారిమీద నా ఉగ్రత తీర్చుకొని నన్ను ఓదార్చుకొందును, నేను వారి మీద నా ఉగ్రత తీర్చుకొనుకాలమున యెహోవానైన నేను ఆసక్తిగలవాడనై ఆలాగు సెలవిచ్చితినని వారు తెలిసి కొందురు

14. ఆలాగు నీ చుట్టునున్న అన్యజనులలో నిన్ను చూచు వారందరి దృష్టికి పాడుగాను నిందాస్పదముగాను నేను నిన్ను చేయుదును.

15. కావున నీ పోషణాధారము తీసివేసి, నీమీదికి నేను మహా క్షామము రప్పించి, నీవారు క్షయమగునట్లుగా వారిని క్షయపరచు మహాక్షామమును పంపించి, కోపముచేతను క్రోధముచేతను కఠినమైన గద్దిం పులచేతను నేను నిన్ను శిక్షింపగా

16. నీ చుట్టునున్న అన్య జనులకు నీవు నిందకును ఎగతాళికిని హెచ్చరికకును విస్మయ మునకును ఆస్పదముగా ఉందువు; యెహోవానగు నేనే ఆజ్ఞ ఇచ్చియున్నాను.

17. ఈ ప్రకారము నేను నీమీదికి క్షామమును దుష్టమృగములను పంపుదును, అవి నీకు పుత్ర హీనత కలుగజేయును, తెగులును ప్రాణహానియు నీకు కలుగును, మరియు నీమీదికి ఖడ్గమును రప్పించెదను; యెహోవానగు నేనే యీలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాను.

About యెహెజ్కేలు Chapter 5

Read యెహెజ్కేలు Chapter 5 online from the Holy Bible. This chapter is part of the Book of యెహెజ్కేలు in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: యెహెజ్కేలు
Chapter: 5
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading యెహెజ్కేలు. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading యెహెజ్కేలు Chapter 5 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is యెహెజ్కేలు Chapter 5?

యెహెజ్కేలు Chapter 5 is part of the Book of యెహెజ్కేలు in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete యెహెజ్కేలు Chapter 5 online for free with easy chapter navigation.

More Chapters from పాత నిబంధన

  1. నిర్గమకాండము Chapter 1
  2. జెకర్యా Chapter 4
  3. దానియేలు Chapter 10
  4. సామెతలు Chapter 4
  5. ఆదికాండము Chapter 1
  6. విలాపవాక్యములు Chapter 3
  7. ప్రసంగి Chapter 12

Explore More from యెహెజ్కేలు

  1. యెహెజ్కేలు Chapter 48
  2. యెహెజ్కేలు Chapter 13
  3. యెహెజ్కేలు Chapter 11
  4. యెహెజ్కేలు Chapter 41
  5. యెహెజ్కేలు Chapter 29
  6. యెహెజ్కేలు Chapter 7
  7. యెహెజ్కేలు Chapter 21

Related Chapters & Readings

  1. నిర్గమకాండము Chapter 30
  2. యెహెజ్కేలు Chapter 28
  3. లూకా Chapter 23
  4. యెహోషువ Chapter 14
  5. కీర్తనలు Chapter 6
  6. 2 కొరింథీయులకు Chapter 4
  7. సంఖ్యాకాండము Chapter 36
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *