1 సమూయేలు Chapter 8

For English

Read 1 సమూయేలు Chapter 8 Online

Read 1 సమూయేలు Chapter 8 online from the Holy Bible. This chapter is part of the Book of 1 సమూయేలు in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of 1 సమూయేలు and the Holy Bible online.

Choose a Chapter

1 సమూయేలు 8

అధ్యాయం 8

1. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రా యేలీయులమీద న్యాయాధిపతులుగా నియమించెను.

2. అతని జ్యేష్ఠకుమారుని పేరు యోవేలు; రెండవవాని పేరు అబీయా,

3. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక, ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా

4. ఇశ్రాయేలీయుల పెద్దలందరు కూడి రామాలో సమూయేలునొద్దకు వచ్చి

5. ​చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తనవంటి ప్రవర్తన గలవారు కారు గనుక, సకలజనుల మర్యాదచొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి.

6. ​మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థనచేసెను.

7. ​అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగాజనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము; వారు నిన్ను విసర్జింపలేదుగాని తమ్మును ఏలకుండ నన్నే విసర్జించి యున్నారు.

8. ​వారు నన్ను విసర్జించి, యితర దేవతలను పూజించి, నేను ఐగుప్తులోనుండి వారిని రప్పించిన నాటి నుండి నేటివరకు తాము చేయుచువచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీయెడలను జరిగించుచున్నారు; వారు చెప్పిన మాటలను అంగీకరించుము.

9. ​అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయుము.

10. ​సమూయేలు తనను, రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్ని వినిపించి

11. ​ఈలాగున చెప్పెనుమిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడగుననగా, అతడు మీ కుమారులను పట్టుకొని, తన రథములను తోలుటకును తన గుఱ్ఱములను కాపాడుటకును వారిని ఉంచుకొనును, కొందరు అతని రథముల ముందర పరగెత్తుదురు.

12. ​మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును; తన భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును తన యుద్ధా యుధములను తన రథముల సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకొనును.

13. ​మీ కుమార్తెలను భక్ష్యకారిణులుగాను బోనకత్తెలుగాను రొట్టెలు కాల్చువారిని గాను పెట్టుకొనును.

14. ​మీ పొలములలోను మీ ద్రాక్షతోటలలోను ఒలీవతోటలలోను శ్రేష్ఠమైనవాటిని తీసికొని తన సేవకులకిచ్చును.

15. ​మీ ధాన్యములోను ద్రాక్ష పండ్లలోను పదియవ భాగము తీసి తన పరివారజనమునకును సేవకులకును ఇచ్చును.

16. ​మీ దాసులను మీ పనికత్తెలను మీ పశువులలోను గార్దభములలోను శ్రేష్ఠమైన వాటిని1 పట్టుకొని తన పనికొరకు ఉంచుకొనును.

17. ​మీ మందలో పదియవభాగము పట్టుకొనును, మీమట్టుకు మీరు అతనికి దాసులవుదురు.

18. ​ఆ దినమున మీరు కోరు కొనిన రాజునుబట్టి మీరు మొఱ్ఱపెట్టినను యెహోవా మీ మొఱ్ఱవినక పోవును అనెను.

19. ​అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిని బెట్టనొల్లకఆలాగున కాదు,

20. ​జనములు చేయురీతిని మేమును చేయునట్లుమాకు రాజుకావలెను, మా రాజు మాకు న్యాయము తీర్చును, మా ముందర పోవుచు అతడే మా యుద్ధములను జరిగించుననిరి.

21. ​సమూయేలు జనులయొక్క మాటలన్నిటిని విని యెహోవా సన్ని ధిని వాటిని వివరించెను

22. ​గనుక యెహోవానీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించుమని సమూయేలునకు సెలవియ్యగా సమూయేలుమీరందరు మీ మీ గ్రామములకు పొండని ఇశ్రాయేలీయులకు సెలవిచ్చెను.

About 1 సమూయేలు Chapter 8

Read 1 సమూయేలు Chapter 8 online from the Holy Bible. This chapter is part of the Book of 1 సమూయేలు in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: 1 సమూయేలు
Chapter: 8
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading 1 సమూయేలు. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading 1 సమూయేలు Chapter 8 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is 1 సమూయేలు Chapter 8?

1 సమూయేలు Chapter 8 is part of the Book of 1 సమూయేలు in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete 1 సమూయేలు Chapter 8 online for free with easy chapter navigation.

More Chapters from 1 సమూయేలు

  1. 1 సమూయేలు Chapter 12
  2. 1 సమూయేలు Chapter 11
  3. 1 సమూయేలు Chapter 10
  4. 1 సమూయేలు Chapter 6
  5. 1 సమూయేలు Chapter 23
  6. 1 సమూయేలు Chapter 19
  7. 1 సమూయేలు Chapter 14

Explore More from పాత నిబంధన

  1. 2 దినవృత్తాంతములు Chapter 29
  2. కీర్తనలు Chapter 19
  3. యెహెజ్కేలు Chapter 35
  4. నిర్గమకాండము Chapter 25
  5. యెహెజ్కేలు Chapter 40
  6. సంఖ్యాకాండము Chapter 13
  7. 1 దినవృత్తాంతములు Chapter 21

Related Chapters & Readings

  1. 1 సమూయేలు Chapter 30
  2. మత్తయి Chapter 26
  3. 2 దినవృత్తాంతములు Chapter 9
  4. యెషయా Chapter 33
  5. యెషయా Chapter 4
  6. న్యాయాధిపతులు Chapter 3
  7. 2 కొరింథీయులకు Chapter 11
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *