యోబు Chapter 4

For English

Read యోబు Chapter 4 Online

Read యోబు Chapter 4 online from the Holy Bible. This chapter is part of the Book of యోబు in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of యోబు and the Holy Bible online.

Choose a Chapter

యోబు 4

అధ్యాయం 4

1. దానికి తేమానీయుడైన ఎలీఫజు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను

2. ఎవడైన ఈ సంగతి యెత్తి నీతో మాటలాడినయెడల నీకు వ్యసనము కలుగునా? అయితే వాదింపక ఎవడు ఊరకొనగలడు?

3. అనేకులకు నీవు బుద్ధి నేర్పినవాడవు బలహీనమైన చేతులను బలపరచినవాడవు.

4. నీ మాటలు తొట్రిల్లువానిని ఆదుకొని యుండెను.క్రుంగిపోయిన మోకాళ్లుగలవానిని నీవు బలపరచితివి.

5. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు.

6. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా?నీ యథార్థప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా?

7. జ్ఞాపకము చేసికొనుము, నిరపరాధియైన యొకడుఎప్పుడైన నశించెనా?యథార్థవర్తనులు ఎక్కడనైన నిర్మూలమైరా?

8. నేను చూచినంతవరకు అక్రమమును దున్నికీడును విత్తువారు దానినే కోయుదురు.

9. దేవుడు ఊదగా వారు నశించుదురుఆయన కోపాగ్ని శ్వాసమువలన వారు లేక పోవుదురు.

10. సింహగర్జనయు క్రూరసింహపు శబ్దమును నిలిచిపోవును.కొదమ సింహముల కోరలును విరిగిపోవును.

11. ఎర లేనందున ఆడుసింహము నశించునుసింహపుపిల్లలు చెల్లా చెదరగొట్టబడును.

12. నా కొకమాట రహస్యముగా తెలుపబడెనునా చెవిలో ఒకడు గుసగుసలాడినట్టుగా అది నాకు వినబడెను.

13. గాఢనిద్ర మనుష్యులకు వచ్చుసమయమున రాత్రి కలలవలన పుట్టు తలంపులలో అది కలిగెను.

14. భయమును వణకును నాకు కలిగెను అందువలన నా యెముకలన్నియు కదిలెను.

15. ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగానా శరీర రోమములు పులకించెను.

16. అది నిలువబడగా దాని రూపమును నేను గురుతుపట్టలేక పోతిని ఒక రూపము నా కన్నులయెదుట నుండెనుమెల్లనైన యొక కంఠస్వరమును నేను వింటినిఏమనగాదేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదురా?

17. తమ్ము సృజించినవాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా?

18. ఆయన తన సేవకులను నమ్ముటలేదుతన దూతలయందు లోపములు కనుగొనుచున్నాడు.

19. జిగటమంటి యిండ్లలో నివసించువారియందుమంటిలో పుట్టినవారియందుచిమ్మట చితికిపోవునట్లు చితికిపోవువారియందు మరి ఎన్ని కనుగొనును?

20. ఉదయము మొదలుకొని సాయంత్రమువరకు ఉండివారు బద్దలైపోవుదురుఎన్నికలేనివారై సదాకాలము నాశనమైయుందురు.

21. వారి డేరాత్రాడు తెగవేయబడునువారు బుద్ధికలుగకయే మృతినొందుదురు.ఆలాగుననే జరుగుచున్నది గదా.

About యోబు Chapter 4

Read యోబు Chapter 4 online from the Holy Bible. This chapter is part of the Book of యోబు in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: యోబు
Chapter: 4
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading యోబు. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading యోబు Chapter 4 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is యోబు Chapter 4?

యోబు Chapter 4 is part of the Book of యోబు in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete యోబు Chapter 4 online for free with easy chapter navigation.

More Chapters from పాత నిబంధన

  1. నిర్గమకాండము Chapter 1
  2. జెకర్యా Chapter 4
  3. దానియేలు Chapter 10
  4. సామెతలు Chapter 4
  5. ఆదికాండము Chapter 1
  6. నెహెమ్యా Chapter 6
  7. విలాపవాక్యములు Chapter 3

Explore More from యోబు

  1. యోబు Chapter 9
  2. యోబు Chapter 11
  3. యోబు Chapter 1
  4. యోబు Chapter 21
  5. యోబు Chapter 39
  6. యోబు Chapter 2
  7. యోబు Chapter 18

Related Chapters & Readings

  1. 2 దినవృత్తాంతములు Chapter 33
  2. రోమీయులకు Chapter 10
  3. ఆదికాండము Chapter 10
  4. మార్కు Chapter 4
  5. మత్తయి Chapter 4
  6. 2 సమూయేలు Chapter 19
  7. యోహాను Chapter 18
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *