యెషయా Chapter 55

For English

Read యెషయా Chapter 55 Online

Read యెషయా Chapter 55 online from the Holy Bible. This chapter is part of the Book of యెషయా in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of యెషయా and the Holy Bible online.

Choose a Chapter

యెషయా 55

అధ్యాయం 55

1. దప్పిగొనినవారలారా, నీళ్లయొద్దకు రండి రూకలులేనివారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు నియ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి.

2. ఆహారము కానిదానికొరకు మీ రేల రూకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయనిదానికొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి మీ ప్రాణముసారమైనదానియందు సుఖింపనియ్యుడి.

3. చెవియొగ్గి నాయొద్దకు రండి మీరు వినినయెడల మీరు బ్రదుకుదురు నేను మీతో నిత్యనిబంధన చేసెదను దావీదునకు చూపిన శాశ్వతకృపను మీకు చూపుదును.

4. ఇదిగో జనములకు సాక్షిగా అతని నియమించితిని జనములకు రాజుగాను అధిపతిగాను అతని నియమించి తిని

5. నీవెరుగని జనులను నీవు పిలిచెదవు నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యెహోవానుబట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునిబట్టి నీయొద్దకు పరుగెత్తి వచ్చెదరు.

6. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడు కొనుడి.

7. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను దుష్టులు తమ తలంపులను మానవలెను వారు యెహోవావైపు తిరిగినయెడల ఆయన వారి యందు జాలిపడును వారు మన దేవునివైపు తిరిగినయెడల ఆయన బహుగా క్షమించును.

8. నా తలంపులు మీ తలంపులవంటిని కావు మీ త్రోవలు నా త్రోవలవంటిని కావు ఇదే యెహోవా వాక్కు

9. ఆకాశములు భూమికిపైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ మార్గములకంటె నా మార్గములు మీ తలంపులకంటె నా తలంపులు అంత యెత్తుగా ఉన్నవి.

10. వర్షమును హిమమును ఆకాశమునుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో ఆలాగే నా నోటనుండి వచ్చువచనమును ఉండును

11. నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలముచేయును.

12. మీరు సంతోషముగా బయలువెళ్లుదురు సమాధానము పొంది తోడుకొని పోబడుదురు మీ యెదుట పర్వతములును మెట్టలును సంగీతనాదము చేయును పొలములోని చెట్లన్నియు చప్పట్లు కొట్టును.

13. ముండ్లచెట్లకు బదులుగా దేవదారువృక్షములు మొలు చును దురదగొండిచెట్లకు బదులుగా గొంజివృక్షములు ఎదు గును అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచన గాను ఉండును.

About యెషయా Chapter 55

Read యెషయా Chapter 55 online from the Holy Bible. This chapter is part of the Book of యెషయా in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: యెషయా
Chapter: 55
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading యెషయా. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading యెషయా Chapter 55 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is యెషయా Chapter 55?

యెషయా Chapter 55 is part of the Book of యెషయా in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete యెషయా Chapter 55 online for free with easy chapter navigation.

More Chapters from పాత నిబంధన

  1. దానియేలు Chapter 10
  2. సామెతలు Chapter 4
  3. నిర్గమకాండము Chapter 1
  4. జెకర్యా Chapter 4
  5. ఆదికాండము Chapter 1
  6. నెహెమ్యా Chapter 6
  7. విలాపవాక్యములు Chapter 3

Explore More from యెషయా

  1. యెషయా Chapter 10
  2. యెషయా Chapter 39
  3. యెషయా Chapter 13
  4. యెషయా Chapter 29
  5. యెషయా Chapter 46
  6. యెషయా Chapter 52
  7. యెషయా Chapter 66

Related Chapters & Readings

  1. కీర్తనలు Chapter 120
  2. యోనా Chapter 1
  3. యెహెజ్కేలు Chapter 14
  4. ద్వితీయోపదేశకాండము Chapter 29
  5. లూకా Chapter 1
  6. కీర్తనలు Chapter 60
  7. 2 థెస్సలొనీకయులకు Chapter 2
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *