యెషయా Chapter 46

For English

Read యెషయా Chapter 46 Online

Read యెషయా Chapter 46 online from the Holy Bible. This chapter is part of the Book of యెషయా in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of యెషయా and the Holy Bible online.

Choose a Chapter

యెషయా 46

అధ్యాయం 46

1. బేలు కూలుచున్నది నెబో క్రుంగుచున్నది వాటి ప్రతిమలు జంతువులమీదను పశువులమీదను మోయబడుచున్నవి

2. మీ మోతలు సొమ్మసిల్లు పశువులకు భారముగా నున్నవి అవి క్రుంగుచు కూలుచు నుండి ఆ బరువులను విడి పించుకొనలేక తామే చెరలోనికి పోయియున్నవి.

3. యాకోబు ఇంటివారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించినవారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొనినవారలారా, నా మాట ఆలకించుడి.

4. ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే తల వెండ్రుకలు నెరయువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే నేనే చేసియున్నాను చంకపెట్టుకొనువాడను నేనే నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే.

5. మేము సమానులమని నన్ను ఎవనికి సాటిచేయుదురు? మేము సమానులమని యెవని నాకు పోటిగా చేయు దురు?

6. దానికి సాగిలపడి నమస్కారము చేయుటకై సంచినుండి బంగారము మెండుగా పోయువారును వెండి తూచువారును దాని దేవతగా నిరూపించవలెనని కంసాలిని కూలికి పిలుతురు.

7. వారు భుజముమీద దాని నెక్కించుకొందురు దాని మోసికొనిపోయి తగినచోట నిలువబెట్టుదురు ఆ చోటు విడువకుండ అది అక్కడనే నిలుచును ఒకడు దానికి మొఱ్ఱపెట్టినను ఉత్తరము చెప్పదు వాని శ్రమ పోగొట్టి యెవనిని రక్షింపదు.

8. దీని జ్ఞాపకము చేసికొని ధైర్యముగా నుండుడి అతిక్రమము చేయువారలారా, దీని ఆలోచించుడి

9. చాల పూర్వమున జరిగినవాటిని జ్ఞాపకము చేసికొనుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు నేను దేవుడను నన్ను పోలినవాడెవడును లేడు.

10. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెర వేర్చుకొనెదననియు, చెప్పుకొనుచు ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయు చున్నాను. పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియజేయుచున్నాను.

11. తూర్పునుండి క్రూరపక్షిని రప్పించుచున్నాను దూరదేశమునుండి నేను యోచించిన కార్యమును నెర వేర్చువానిని పిలుచుచున్నాను నేను చెప్పియున్నాను దాని నెరవేర్చెదను ఉద్దేశించియున్నాను సఫలపరచెదను.

12. కఠినహృదయులై నీతికి దూరముగా ఉన్నవారలారా, నా మాట ఆలకించుడి

13. నా నీతిని దగ్గరకు రప్పించియున్నాను అది దూరమున లేదు నా రక్షణ ఆలస్యము చేయలేదు సీయోనులో రక్షణనుండ నియమించుచున్నాను ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించు చున్నాను.

About యెషయా Chapter 46

Read యెషయా Chapter 46 online from the Holy Bible. This chapter is part of the Book of యెషయా in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: యెషయా
Chapter: 46
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading యెషయా. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading యెషయా Chapter 46 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is యెషయా Chapter 46?

యెషయా Chapter 46 is part of the Book of యెషయా in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete యెషయా Chapter 46 online for free with easy chapter navigation.

More Chapters from పాత నిబంధన

  1. దానియేలు Chapter 10
  2. సామెతలు Chapter 4
  3. నిర్గమకాండము Chapter 1
  4. జెకర్యా Chapter 4
  5. ఆదికాండము Chapter 1
  6. విలాపవాక్యములు Chapter 3
  7. నెహెమ్యా Chapter 6

Explore More from యెషయా

  1. యెషయా Chapter 22
  2. యెషయా Chapter 20
  3. యెషయా Chapter 7
  4. యెషయా Chapter 39
  5. యెషయా Chapter 31
  6. యెషయా Chapter 38
  7. యెషయా Chapter 32

Related Chapters & Readings

  1. యెహెజ్కేలు Chapter 34
  2. యెహెజ్కేలు Chapter 37
  3. నిర్గమకాండము Chapter 31
  4. యిర్మీయా Chapter 17
  5. రోమీయులకు Chapter 9
  6. జెకర్యా Chapter 12
  7. యెషయా Chapter 1
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *