ద్వితీయోపదేశకాండము Chapter 18

For English

Read ద్వితీయోపదేశకాండము Chapter 18 Online

Read ద్వితీయోపదేశకాండము Chapter 18 online from the Holy Bible. This chapter is part of the Book of ద్వితీయోపదేశకాండము in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of ద్వితీయోపదేశకాండము and the Holy Bible online.

Choose a Chapter

ద్వితీయోపదేశకాండము 18

అధ్యాయం 18

1. యాజకులైన లేవీయులకు, అనగా లేవీగోత్రీయుల కందరికి ఇశ్రాయేలీయులతో పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు, వారు యెహోవా హోమద్రవ్యములను తిందురు; అది వారి హక్కు.

2. వారి సహోదరులతో వారికి స్వాస్థ్యము కలుగదు; యెహోవా వారితో చెప్పి నట్లు ఆయనే వారికి స్వాస్థ్యము. జనులవలన, అనగా ఎద్దుగాని గొఱ్ఱగాని మేకగాని బలిగా అర్పించువారి వలన

3. యాజకులు పొందవలసిన దేదనగా, కుడిజబ్బను రెండు దవడలను పొట్టను యాజకుని కియ్యవలెను.

4. నీ ధాన్యములోను నీ ద్రాక్షారసములోను నీ నూనెలోను ప్రథమ ఫలములను నీ గొఱ్ఱల మొదటి బొచ్చును అతని కియ్యవలెను.

5. నిత్యము యెహోవా నామమున నిలిచి సేవచేయుటకు నీ గోత్రములన్నిటిలోను అతనిని అతని సంతతివారిని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొని యున్నాడు.

6. ఒక లేవీయుడు ఇశ్రాయేలీయుల దేశమున తాను విదేశిగా నివసించిన నీ గ్రామములలో ఒకదానినుండి యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు మిక్కిలి మక్కు వతో వచ్చినప్పుడు

7. అక్కడ యెహోవా సన్నిధిని నిలుచు లేవీయులైన తన గోత్రపువారు చేయునట్లు అతడు తన దేవుడైన యెహోవా నామమున సేవచేయవలెను.

8. అమ్మబడిన తన పిత్రార్జితమువలన తనకు వచ్చినది గాక అతడు ఇతరులవలె వంతు అనుభవింపవలెను.

9. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయకృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు.

10. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను, శకు నముచెప్పు సోదెగానినైనను, మేఘ శకునములనుగాని సర్ప శకునములను గాని చెప్పు వానినైనను, చిల్లంగివానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునినైనను

11. కర్ణపిశాచి నడుగువానినైనను, దయ్యములయొద్ద విచారణచేయు వాని నైనను మీ మధ్య ఉండనియ్యకూడదు.

12. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయము లైన వాటినిబట్టి నీ దేవుడైన యెహోవా నీ యెదుటనుండి ఆ జనములను వెళ్లగొట్టుచున్నాడు.

13. నీవు నీ దేవుడైన యెహోవాయొద్ద యథార్థపరుడవై యుండవలెను.

14. నీవు స్వాధీనపరచుకొనబోవు జనములు మేఘశకునములను చెప్పువారి మాటను సోదెగాండ్ర మాటను విందురు. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆలాగున చేయనియ్యడు.

15. హోరేబులో ఆ సమాజదినమున నీవునేను చావక యుండునట్లు మళ్లి నా దేవుడైన యెహోవా స్వరము నాకు విన బడకుండును గాక,

16. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండునుగాక అని చెప్పితివి. ఆ సమయ మున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నావంటి ప్రవక్తను నీ సహోదరులలో నీకొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను.

17. ​మరియు యెహోవా నాతో ఇట్లనెను. వారు చెప్పిన మాట మంచిది;

18. ​వారి సహో దరులలోనుండి నీవంటి ప్రవక్తను వారికొరకు పుట్టించెదను; అతని నోట నా మాటల నుంచుదును; నేను అతని కాజ్ఞా పించునది యావత్తును అతడు వారితో చెప్పును.

19. అతడు నా నామమున చెప్పు నా మాటలను విననివానిని దాని గూర్చి విచారణ చేసెదను.

20. అంతేకాదు, ఏ ప్రవక్తయు అహంకారము పూని, నేను చెప్పుమని తన కాజ్ఞాపించని మాటను నా నామమున చెప్పునో, యితర దేవతల నామమున చెప్పునో ఆ ప్రవక్తయును చావవలెను.

21. ​మరియు ఏదొకమాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలిసికొనగలమని మీరనుకొనిన యెడల,

22. ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరుగక పోయిన యెడలను ఎన్నడును నెరవేరకపోయిన యెడ లను అది యెహోవా చెప్పిన మాట కాదు, ఆ ప్రవక్త అహంకారముచేతనే దాని చెప్పెను గనుక దానికి భయ పడవద్దు.

About ద్వితీయోపదేశకాండము Chapter 18

Read ద్వితీయోపదేశకాండము Chapter 18 online from the Holy Bible. This chapter is part of the Book of ద్వితీయోపదేశకాండము in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: ద్వితీయోపదేశకాండము
Chapter: 18
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading ద్వితీయోపదేశకాండము. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading ద్వితీయోపదేశకాండము Chapter 18 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is ద్వితీయోపదేశకాండము Chapter 18?

ద్వితీయోపదేశకాండము Chapter 18 is part of the Book of ద్వితీయోపదేశకాండము in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete ద్వితీయోపదేశకాండము Chapter 18 online for free with easy chapter navigation.

More Chapters from ద్వితీయోపదేశకాండము

  1. ద్వితీయోపదేశకాండము Chapter 2
  2. ద్వితీయోపదేశకాండము Chapter 17
  3. ద్వితీయోపదేశకాండము Chapter 14
  4. ద్వితీయోపదేశకాండము Chapter 8
  5. ద్వితీయోపదేశకాండము Chapter 5
  6. ద్వితీయోపదేశకాండము Chapter 4
  7. ద్వితీయోపదేశకాండము Chapter 32

Explore More from పాత నిబంధన

  1. పరమగీతము Chapter 4
  2. 2 దినవృత్తాంతములు Chapter 28
  3. సామెతలు Chapter 20
  4. ఓబద్యా Chapter 1
  5. లేవీయకాండము Chapter 18
  6. కీర్తనలు Chapter 57
  7. సామెతలు Chapter 30

Related Chapters & Readings

  1. ఆదికాండము Chapter 34
  2. ఎజ్రా Chapter 4
  3. కీర్తనలు Chapter 61
  4. యోబు Chapter 27
  5. అపొస్తలుల కార్యములు Chapter 26
  6. అపొస్తలుల కార్యములు Chapter 25
  7. పరమగీతము Chapter 2
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *