ఆదికాండము Chapter 15

For English

Read ఆదికాండము Chapter 15 Online

Read ఆదికాండము Chapter 15 online from the Holy Bible. This chapter is part of the Book of ఆదికాండము in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of ఆదికాండము and the Holy Bible online.

Choose a Chapter

ఆదికాండము 15

అధ్యాయం 15

1. ఇవి జరిగినతరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి అబ్రామా, భయపడకుము; నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను.

2. అందుకు అబ్రాముప్రభువైన యెహోవా నాకేమి యిచ్చిననేమి? నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే; దమస్కు ఎలీయెజెరే నాయింటి ఆస్తి కర్తయగును గదా

3. మరియు అబ్రాముఇదిగో నీవు నాకు సంతానమియ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా

4. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు; నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను.

5. మరియు ఆయన వెలుపలికి అతని తీసికొని వచ్చినీవు ఆకాశమువైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పినీ సంతానము ఆలాగవునని చెప్పెను.

6. అతడు యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను.

7. మరియు ఆయననీవు ఈ దేశమును స్వతం త్రించు కొనునట్లు దాని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములోనుండి నిన్ను ఇవతలకు తీసికొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు

8. అతడు ప్రభువైన యెహోవా, నేను దీని స్వతంత్రించు కొనెదనని నాకెట్లు తెలియుననగా

9. ఆయన మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేలును ఒక తెల్ల గువ్వను ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను.

10. అతడు అవన్నియు తీసికొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను; పక్షులను అతడు ఖండింపలేదు

11. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను.

12. ప్రొద్దుగ్రుంక బోయినప్పుడు అబ్రామునకు గాఢనిద్రపట్టెను. భయంకరమైన కటికచీకటి అతని కమ్మగా

13. ఆయననీ సంతతివారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపువారికి దాసులుగా నుందురు.

14. వారు నాలుగు వందల యేండ్లు వీరిని శ్రమ పెట్టుదురు; వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు.

15. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయె దవు; మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడుదువు.

16. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరమువారు ఇక్కడికి మరల వచ్చెదరని నిశ్చయముగా తెలిసికొనుమని అబ్రాముతో చెప్పెను.

17. మరియు ప్రొద్దు గ్రుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్నపొయ్యియు అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను.

18. ఆ దినమందే యెహోవాఐగుప్తు నది మొదలుకొని గొప్ప నదియైన యూఫ్రటీసు నదివరకు ఈ దేశమును, అనగా

19. కేనీయు లను కనిజ్జీయులను కద్మోనీయులను

20. హిత్తీయులను పెరి జ్జీయులను రెఫాయీయులను

21. అమోరీయులను కనా నీయులను గిర్గాషీయులను యెబూసీయులను నీ సంతాన మున కిచ్చియున్నానని అబ్రాముతో నిబంధన చేసెను.

About ఆదికాండము Chapter 15

Read ఆదికాండము Chapter 15 online from the Holy Bible. This chapter is part of the Book of ఆదికాండము in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: ఆదికాండము
Chapter: 15
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading ఆదికాండము. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading ఆదికాండము Chapter 15 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is ఆదికాండము Chapter 15?

ఆదికాండము Chapter 15 is part of the Book of ఆదికాండము in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete ఆదికాండము Chapter 15 online for free with easy chapter navigation.

More Chapters from ఆదికాండము

  1. ఆదికాండము Chapter 1
  2. ఆదికాండము Chapter 25
  3. ఆదికాండము Chapter 19
  4. ఆదికాండము Chapter 42
  5. ఆదికాండము Chapter 30
  6. ఆదికాండము Chapter 20
  7. ఆదికాండము Chapter 16

Explore More from పాత నిబంధన

  1. 1 సమూయేలు Chapter 14
  2. కీర్తనలు Chapter 1
  3. కీర్తనలు Chapter 61
  4. కీర్తనలు Chapter 147
  5. జెకర్యా Chapter 4
  6. యెషయా Chapter 7
  7. యెహోషువ Chapter 21

Related Chapters & Readings

  1. సంఖ్యాకాండము Chapter 27
  2. ప్రసంగి Chapter 12
  3. 1 రాజులు Chapter 20
  4. రోమీయులకు Chapter 4
  5. 1 సమూయేలు Chapter 4
  6. 1 దినవృత్తాంతములు Chapter 10
  7. ద్వితీయోపదేశకాండము Chapter 30
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *