సామెతలు Chapter 20

For English

Read సామెతలు Chapter 20 Online

Read సామెతలు Chapter 20 online from the Holy Bible. This chapter is part of the Book of సామెతలు in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of సామెతలు and the Holy Bible online.

Choose a Chapter

సామెతలు 20

అధ్యాయం 20

1. ద్రాక్షారసము వెక్కిరింతల పాలుచేయును మద్యము అల్లరి పుట్టించును దాని వశమైనవారందరు జ్ఞానములేనివారు.

2. రాజువలని భయము సింహగర్జనవంటిది రాజునకు క్రోధము పుట్టించువారు తమకు ప్రాణ మోసము తెచ్చుకొందురు

3. కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును.

4. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు కోతకాలమున పంటనుగూర్చి వాడు విచారించు నప్పుడు వానికేమియు లేకపోవును.

5. నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిది వివేకముగలవాడు దానిని పైకి చేదుకొనును.

6. దయ చూపువానిని కలిసికొనుట అనేకులకు తట స్థించును నమ్ముకొనదగినవాడు ఎవరికి కనబడును?

7. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు.

8. న్యాయసింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును.

9. నా హృదయమును శుద్ధపరచుకొని యున్నాను పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతిననుకొనదగిన వాడెవడు?

10. వేరువేరు తూనికె రాళ్లు వేరువేరు కుంచములు ఈ రెండును యెహోవాకు హేయములు.

11. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టలవలన తెలియజేయును.

12. వినగల చెవి చూడగల కన్ను ఈ రెండును యెహోవా కలుగచేసినవే.

13. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము నీవు మేల్కొనియుండినయెడల ఆహారము తిని తృప్తి పొందుదువు.

14. కొనువాడుజబ్బుది జబ్బుది అనును అవతలికి వెళ్లి దాని మెచ్చుకొనును.

15. బంగారును విస్తారమైన ముత్యములును కలవు. తెలివి నుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు.

16. అన్యునికొరకు పూటబడినవాని వస్త్రమును పుచ్చు కొనుము పరులకొరకు వానినే కుదువపెట్టించుము

17. మోసము చేసి తెచ్చుకొన్న ఆహారము మనుష్యులకు బహు ఇంపుగా ఉండును పిమ్మట వాని నోరు మంటితో నింపబడును.

18. ఉద్దేశములు ఆలోచనచేత స్థిరపరచబడును వివేకముగల నాయకుడవై యుద్ధము చేయుము.

19. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును కావున వదరుబోతుల జోలికి పోకుము.

20. తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారుచీకటిలో ఆరిపోవును.

21. మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును.

22. కీడుకు ప్రతికీడు చేసెదననుకొనవద్దు యెహోవాకొరకు కనిపెట్టుకొనుము ఆయన నిన్ను రక్షించును.

23. వేరువేరు తూనికె రాళ్లు యెహోవాకు హేయములు దొంగత్రాసు అనుకూలము కాదు.

24. ఒకని నడతలు యెహోవా వశము తనకు సంభవింపబోవునది యొకడెట్లు తెలిసికొన గలడు?

25. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మ్రొక్కుకొనిన తరువాత దానిగూర్చి విచారించు టయు ఒకనికి ఉరియగును.

26. జ్ఞానముగల రాజు భక్తిహీనులను చెదరగొట్టును వారిమీద చక్రము దొర్లించును.

27. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నియు శోధించును.

28. కృపాసత్యములు రాజును కాపాడును కృపవలన అతడు తన సింహాసనమును స్థిరపరచు కొనును.

29. ¸°వనస్థుల బలము వారికి అలంకారము తలనెరపు వృద్ధులకు సౌందర్యము

30. గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగిం చును.

About సామెతలు Chapter 20

Read సామెతలు Chapter 20 online from the Holy Bible. This chapter is part of the Book of సామెతలు in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: సామెతలు
Chapter: 20
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading సామెతలు. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading సామెతలు Chapter 20 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is సామెతలు Chapter 20?

సామెతలు Chapter 20 is part of the Book of సామెతలు in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete సామెతలు Chapter 20 online for free with easy chapter navigation.

More Chapters from పాత నిబంధన

  1. దానియేలు Chapter 10
  2. సామెతలు Chapter 4
  3. నిర్గమకాండము Chapter 1
  4. జెకర్యా Chapter 4
  5. ఆదికాండము Chapter 1
  6. నెహెమ్యా Chapter 6
  7. విలాపవాక్యములు Chapter 3

Explore More from సామెతలు

  1. సామెతలు Chapter 8
  2. సామెతలు Chapter 17
  3. సామెతలు Chapter 1
  4. సామెతలు Chapter 24
  5. సామెతలు Chapter 14
  6. సామెతలు Chapter 25
  7. సామెతలు Chapter 6

Related Chapters & Readings

  1. నిర్గమకాండము Chapter 33
  2. ద్వితీయోపదేశకాండము Chapter 24
  3. కీర్తనలు Chapter 129
  4. యోబు Chapter 34
  5. యిర్మీయా Chapter 50
  6. కీర్తనలు Chapter 68
  7. నెహెమ్యా Chapter 1
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *