2 సమూయేలు Chapter 14

For English

Read 2 సమూయేలు Chapter 14 Online

Read 2 సమూయేలు Chapter 14 online from the Holy Bible. This chapter is part of the Book of 2 సమూయేలు in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of 2 సమూయేలు and the Holy Bible online.

Choose a Chapter

2 సమూయేలు 14

అధ్యాయం 14

1. రాజు అబ్షాలోముమీద ప్రాణము పెట్టుకొని… యున్నాడని2 సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించి

2. ​తెకోవనుండి యుక్తిగల యొక స్త్రీని పిలువ నంపించిఏడ్చుచున్న దానవైనట్టు నటించి దుఃఖవస్త్రములు ధరించుకొని తైలము పూసికొనక బహు కాలము దుఃఖపడిన దానివలెనుండి

3. నీవు రాజునొద్దకు వచ్చి యీ ప్రకారము మనవి చేయవలెనని దానికి బోధించెను.

4. కాగా తెకోవ ఊరి స్త్రీ రాజునొద్దకువచ్చి సాగిలపడి సమస్కారము చేసిరాజా రక్షించు మనగా

5. రాజునీకేమి కష్టము వచ్చెనని అడిగెను. అందుకు ఆమెనేను నిజముగా విధవరాలను, నా పెనిమిటి చనిపోయెను;

6. నీ దాసినైన నాకు ఇద్దరు కుమారులు ఉండిరి, వారు పొలములో పెనుగు లాడుచుండగా విడిపించు వాడెవడును లేకపోయినందున వారిలో నొకడు రెండవవాని కొట్టి చంపెను.

7. కాబట్టి నా యింటివారందరును నీ దాసినైన నామీదికి లేచితన సహోదరుని చంపినవాని అప్పగించుము; తన సహోదరుని ప్రాణము తీసినందుకై మేము వానిని చంపి హక్కు దారుని నాశనము చేతుమనుచున్నారు. ఈలాగున వారు నా పెనిమిటికి భూమిమీద పేరైనను శేషమైనను లేకుండ మిగిలిన నిప్పురవను ఆర్పివేయబోవు చున్నారని రాజుతో చెప్పగా

8. ​రాజునీవు నీ యింటికి పొమ్ము, నిన్నుగురించి ఆజ్ఞ ఇత్తునని ఆమెతో చెప్పెను.

9. అందుకు తెకోవ ఊరి స్త్రీనా యేలినవాడా రాజా, దోషము నామీదను నాతండ్రి ఇంటివారి మీదను నిలుచునుగాక, రాజునకును రాజు సింహా సనమునకును దోషము తగులకుండునుగాక అని రాజుతో అనగా

10. రాజుఎవడైనను దీనినిగూర్చి నిన్నేమైన అనినయెడల వానిని నాయొద్దకు తోడుకొనిరమ్ము; వాడికను నిన్ను ముట్టక యుండునని ఆమెతో చెప్పెను.

11. అప్పుడు ఆమెరాజవైన నీవు నీ దేవుడైన యెహోవాను స్మరించి హత్యకు ప్రతిహత్య చేయువారు నా కుమారుని నశింపజేయకుండ ఇకను నాశనము చేయుట మాన్పించుమని మనవిచేయగా రాజుయెహోవా జీవము తోడు నీ కుమారుని తల వెండ్రుకలలో ఒకటైనను నేల రాలకుండుననెను.

12. అప్పుడు ఆ స్త్రీనా యేలినవాడవగు నీతో ఇంకొక మాటచెప్పుకొనుట నీ దాసినగు నాకు దయచేసి సెలవిమ్మని మనవిచేయగా రాజుచెప్పుమనెను.

13. అందుకు ఆ స్త్రీదేవుని జనులైనవారికి విరోధముగా నీ వెందుకు దీనిని తలపెట్టియున్నావు? రాజు ఆ మాట సెల విచ్చుటచేత తాను వెళ్లగొట్టిన తనవాని రానియ్యక తానే దోషియగుచున్నాడు.

14. మనమందరమును చనిపోదుము గదా, నేలను ఒలికినమీదట మరల ఎత్తలేని నీటివలె ఉన్నాము; దేవుడు ప్రాణముతీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్థుడు కాకయుండుటకు సాధనములు కల్పించుచున్నాడు.

15. జనులు నన్ను భయపెట్టిరి గనుక నేను దీనిని గూర్చి నా యేలినవాడవగు నీతో మాటలాడ వచ్చితిని. కాబట్టి నీ దాసురాలనగు నేనురాజు తన దాసినగు నా మనవి చొప్పున చేయు నేమో

16. రాజు నా మనవి అంగీకరించి దేవుని స్వాస్థ్యము అనుభవింపకుండ నన్నును నా కుమారునిని నాశనము చేయదలచిన వాని చేతిలోనుండి తన దాసినగు నన్ను విడిపించునేమో అనుకొంటిని.

17. మరియు నీ దేవుడైన యెహోవా నీకు తోడై యున్నాడు గనుక నా యేలినవాడవును రాజవునగు నీవు దేవుని దూతవంటివాడవై మంచి చెడ్డలన్నియు విచారింప చాలియున్నావు; కాబట్టి నీ దాసినగు నేను నా యేలినవాడగు రాజు సెలవిచ్చిన మాట సమాధానకర మగునని అనుకొంటిననెను.

18. రాజునేను నిన్ను అడుగు సంగతి నీ వెంతమాత్రమును మరుగు చేయవద్దని ఆ స్త్రీతో అనగా ఆమెనా యేలినవాడవగు నీవు సెలవిమ్మనెను.

19. అంతట రాజుయోవాబు నీకు బోధించెనా అని ఆమె నడిగినందుకు ఆమె యిట్లనెనునా యేలినవాడవైన రాజా, నీ ప్రాణముతోడు, చెప్పినదానిని తప్పక గ్రహించుటకు నా యేలిన వాడవును రాజవునగు నీవంటివాడొకడును లేడు; నీ సేవకుడగు యోవాబు నాకు బోధించి యీ మాటలన్నిటిని నీ దాసినగు నాకు నేర్పెను

20. సంగతిని రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడగు యోవాబు ఏర్పాటు చేసెను. ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నా యేలినవాడవగు నీవు దేవ దూతల జ్ఞానమువంటి జ్ఞానము గలవాడవు.

21. అప్పుడు రాజు యోవాబుతో ఈలాగున సెలవిచ్చెను. ఆలకించుము, నీవు మనవి చేసినదానిని నేను ఒప్పు కొనుచున్నాను.

22. తరువాత¸°వనుడగు అబ్షాలోమును రప్పింపుమని అతడు సెలవియ్యగా యోవాబు సాష్టాంగ నమస్కారము చేసి రాజును స్తుతించిరాజవగు నీవు నీ దాసుడనైన నా మనవి అంగీకరించినందున నా యేలిన వాడవగు నీవలన నేను అనుగ్రహము నొందితినని నాకు తెలిసెనని చెప్పి లేచి గెషూరునకు పోయి

23. అబ్షాలోమును యెరూషలేమునకు తోడుకొని వచ్చెను.

24. అయితే రాజు అతడు నా దర్శనము చేయక తన ఇంటికి పోవలెనని ఉత్తరవు చేయగా అబ్షాలోము రాజదర్శనము చేయక తన ఇంటికి పోయెను.

25. ఇశ్రాయేలీయులందరిలో అబ్షాలోమంత సౌందర్యము గలవాడు ఒకడును లేడు; అరికాలు మొదలుకొని తలవరకు ఏ లోపమును అతనియందు లేకపోయెను.

26. తన తల వెండ్రుకలు భారముగా నున్నందున ఏటేట అతడు వాటిని కత్తిరించుచు వచ్చెను; కత్తిరించునప్పుడెల్ల వాటి యెత్తు రాజు తూనికనుబట్టి రెండువందల తులములాయెను.

27. అబ్షాలోమునకు ముగ్గురు కుమారులును తామారు అనునొక కుమార్తెయు పుట్టిరి; ఆమె బహు సౌందర్యవతి.

28. అబ్షాలోము రెండు నిండు సంవత్సరములు యెరూషలే ములోనుండియు రాజదర్శనము చేయక యుండగా

29. యోవాబును రాజునొద్దకు పంపించుటకై అబ్షాలోము అతనిని పిలువనంపినప్పుడు యోవాబు రానొల్లక యుండెను. రెండవమారు అతని పిలువ నంపినప్పుడు అతడు రానొల్లక పోగా

30. అబ్షాలోము తన పనివారిని పిలిచియోవాబు పొలము నా పొలముదగ్గర నున్నది గదా, దానిలో యవల చేలు ఉన్నవి; మీరు పోయి వాటిని తగులబెట్టుడని వారితో చెప్పెను. అబ్షాలోము పనివారు ఆ చేలు తగుల బెట్టగా

31. యావాబు చూచి లేచి అబ్షాలోము ఇంటికి వచ్చినీ పనివారు నా చేలు తగులబెట్టిరేమని అడుగగా

32. అబ్షాలోము యోవాబుతో ఇట్లనెనుగెషూరునుండి నేను వచ్చిన ఫలమేమి? నేనచ్చటనే యుండుట మేలని నీద్వారా రాజుతో చెప్పుకొనుటకై రాజునొద్దకు నిన్ను పంపవలెనని నేను నిన్ను పిలిచితిని; రాజదర్శనము నేను చేయవలెను; నాయందు దోషము కనబడినయెడల రాజు నాకు మరణశిక్ష విధింపవచ్చును.

33. అంతట యోవాబు రాజునొద్దకు వచ్చి ఆ సమాచారము తెలుపగా, రాజు అబ్షాలోమును పిలువనంపించెను. అతడు రాజునొద్దకు వచ్చి రాజసన్నిధిని సాష్టాంగ నమస్కారము చేయగా రాజు అబ్షాలోమును ముద్దుపెట్టుకొనెను.

About 2 సమూయేలు Chapter 14

Read 2 సమూయేలు Chapter 14 online from the Holy Bible. This chapter is part of the Book of 2 సమూయేలు in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: 2 సమూయేలు
Chapter: 14
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading 2 సమూయేలు. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading 2 సమూయేలు Chapter 14 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is 2 సమూయేలు Chapter 14?

2 సమూయేలు Chapter 14 is part of the Book of 2 సమూయేలు in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete 2 సమూయేలు Chapter 14 online for free with easy chapter navigation.

More Chapters from 2 సమూయేలు

  1. 2 సమూయేలు Chapter 22
  2. 2 సమూయేలు Chapter 15
  3. 2 సమూయేలు Chapter 17
  4. 2 సమూయేలు Chapter 21
  5. 2 సమూయేలు Chapter 19
  6. 2 సమూయేలు Chapter 18
  7. 2 సమూయేలు Chapter 12

Explore More from పాత నిబంధన

  1. నెహెమ్యా Chapter 7
  2. సంఖ్యాకాండము Chapter 36
  3. కీర్తనలు Chapter 45
  4. కీర్తనలు Chapter 145
  5. ఆమోసు Chapter 1
  6. ఆదికాండము Chapter 41
  7. 1 రాజులు Chapter 3

Related Chapters & Readings

  1. కీర్తనలు Chapter 105
  2. యెషయా Chapter 58
  3. 2 దినవృత్తాంతములు Chapter 11
  4. 2 తిమోతికి Chapter 3
  5. యెహెజ్కేలు Chapter 47
  6. యోబు Chapter 41
  7. 1 దినవృత్తాంతములు Chapter 17
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *