2 కొరింథీయులకు Chapter 2

For English

Read 2 కొరింథీయులకు Chapter 2 Online

Read 2 కొరింథీయులకు Chapter 2 online from the Holy Bible. This chapter is part of the Book of 2 కొరింథీయులకు in the New Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of 2 కొరింథీయులకు and the Holy Bible online.

Choose a Chapter

2 కొరింథీయులకు 2

అధ్యాయం 2

1. మరియు నేను దుఃఖముతో మీయొద్దకు తిరిగిరానని నామట్టుకు నేను నిశ్చయించుకొంటిని.

2. నేను మిమ్మును దుఃఖపరచునెడల నాచేత దుఃఖపరచబడినవాడు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరచును?

3. నేను వచ్చి నప్పుడు ఎవరివలన నేను సంతోషము పొందతగినదో, వారివలన నాకు దుఃఖము కలుగకుండవలెనని యీ సంగతి మీకు వ్రాసితిని. మరియు నా సంతోషము మీ అందరి సంతోషమేయని మీ అందరియందు నమ్మకము కలిగి యీలాగు వ్రాసితిని.

4. మీకు దుఃఖము కలుగవలెనని కాదు గాని, మీయెడల నాకు కలిగియున్న అత్యధికమైన ప్రేమను మీరు తెలిసికొనవలెనని, నిండు శ్రమతోను మనోవేదనతోను ఎంతో కన్నీరు విడుచుచు మీకు వ్రాసితిని.

5. ఎవడైనను దుఃఖము కలుగజేసి యుండినయెడల,నాకు మాత్రము కాదు కొంతమట్టుకు మీకందరికిని దుఃఖము కలుగజేసియున్నాడు. నేను విశేషభారము వానిమీద మోపగోరక యీ మాట చెప్పుచున్నాను.

6. అట్టివానికి మీలో ఎక్కువమందివలన కలిగిన యీ శిక్షయే చాలును

7. గనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేనియెడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును.

8. కావున వాని యెడల మీ ప్రేమను స్థిరపరచవలెనని మిమ్మును బతిమాలుకొను చున్నాను.

9. మీరన్ని విషయములందు విధేయులై యున్నారేమో అని మీ యోగ్యత తెలిసికొనుటకే గదా పూర్వము వ్రాసితిని.

10. మీరు దేనిగూర్చియైనను ఎవని క్షమించుచున్నారో నేనును వానిని క్షమించుచున్నాను.

11. నేనేమైనను క్షమించియుంటే సాతాను మనలను మోస పరచకుండునట్లు, మీ నిమిత్తము, క్రీస్తు సముఖమునందు క్షమించియున్నాను; సాతాను తంత్రములను మనము ఎరుగనివారము కాము.

12. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చి నప్పుడు, ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి యుండగా సహోదరుడైన తీతు నాకు కన బడనందున

13. నా మనస్సులో నెమ్మది లేక వారియొద్ద సెలవు తీసికొని అక్కడనుండి మాసిదోనియకు బయలుదేరితిని.

14. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానముయొక్క సువాసనను కనుపరచుచు ఆయనయందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము.

15. రక్షింపబడువారి పట్లను నశించువారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై యున్నాము.

16. నశించువారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింప బడువారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము.

17. కావున ఇట్టి సంగతులకు చాలినవాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకులవలె ఉండక, నిష్కాపట్యముగలవారమును దేవునివలన నియమింపబడిన వారమునైయుండి, క్రీస్తునందు దేవునియెదుట బోధించు చున్నాము.

About 2 కొరింథీయులకు Chapter 2

Read 2 కొరింథీయులకు Chapter 2 online from the Holy Bible. This chapter is part of the Book of 2 కొరింథీయులకు in the New Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: 2 కొరింథీయులకు
Chapter: 2
Testament: New Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading 2 కొరింథీయులకు. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading 2 కొరింథీయులకు Chapter 2 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is 2 కొరింథీయులకు Chapter 2?

2 కొరింథీయులకు Chapter 2 is part of the Book of 2 కొరింథీయులకు in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete 2 కొరింథీయులకు Chapter 2 online for free with easy chapter navigation.

More Chapters from 2 కొరింథీయులకు

  1. 2 కొరింథీయులకు Chapter 3
  2. 2 కొరింథీయులకు Chapter 13
  3. 2 కొరింథీయులకు Chapter 11
  4. 2 కొరింథీయులకు Chapter 8
  5. 2 కొరింథీయులకు Chapter 5
  6. 2 కొరింథీయులకు Chapter 6
  7. 2 కొరింథీయులకు Chapter 4

Explore More from కొత్త నిబంధన

  1. 2 పేతురు Chapter 3
  2. అపొస్తలుల కార్యములు Chapter 27
  3. యోహాను Chapter 12
  4. మార్కు Chapter 8
  5. మార్కు Chapter 13
  6. లూకా Chapter 9
  7. 1 పేతురు Chapter 2

Related Chapters & Readings

  1. యోబు Chapter 12
  2. కీర్తనలు Chapter 51
  3. యెహోషువ Chapter 14
  4. కీర్తనలు Chapter 85
  5. 2 సమూయేలు Chapter 18
  6. సంఖ్యాకాండము Chapter 30
  7. నిర్గమకాండము Chapter 18
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *