లేవీయకాండము Chapter 3

For English

Read లేవీయకాండము Chapter 3 Online

Read లేవీయకాండము Chapter 3 online from the Holy Bible. This chapter is part of the Book of లేవీయకాండము in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of లేవీయకాండము and the Holy Bible online.

Choose a Chapter

లేవీయకాండము 3

అధ్యాయం 3

1. అతడు అర్పించునది సమాధానబలియైనయెడల అతడు గోవులలోనిది తీసికొని వచ్చినయెడల అది మగదేగాని ఆడుదేగాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసికొనిరావలెను.

2. తాను అర్పించు దాని తలమీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున దానిని వధింపవలెను. యాజ కులగు అహరోను కుమారులు బలిపీఠముచుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను.

3. అతడు ఆ సమాధాన బలి పశువుయొక్క ఆంత్రముల లోపలి క్రొవ్వును ఆంత్ర ములమీది క్రొవ్వంతటిని రెండు మూత్ర గ్రంధులను వాటిమీదను

4. డొక్కలమీదనున్న క్రొవ్వును కాలే జముమీదను మూత్రగ్రంథుల మీదనున్న వపను యెహోవాకు హోమముగా అర్పింవలెను.

5. అహరోను కుమారులు బలిపీఠముమీద, అనగా అగ్నిమీది కట్టె లపైనున్న దహనబలి ద్రవ్యముపైని దానిని దహింప వలెను. అది యెహోవాకు ఇంపైన సువాసనగలహోమము.

6. యెహోవాకు సమాధానబలిగా ఒకడు అర్పించునది గొఱ్ఱ మేకలలోనిదైనయెడల అది మగదేగాని ఆడుదేగాని నిర్దోషమైనదాని తీసికొని రావలెను.

7. అతడర్పించు అర్ప ణము గొఱ్ఱపిల్లయైన యెడల యెహోవా సన్నిధికి దానిని తీసికొని రావలెను.

8. తాను అర్పించు దాని తలమీద అతడు తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము నెదుట దానిని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠము చుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను.

9. ఆ సమాధాన బలి పశువుయొక్క క్రొవ్వును ముడ్డిపూస మొదలుకొని క్రొవ్విన తోక అంతటిని ఆంత్రములలోని క్రొవ్వును ఆంత్రములమీది క్రొవ్వు అంతటిని

10. రెండు మూత్ర గ్రంథులను వాటిమీది డొక్కల పైనున్న క్రొవ్వును మూత్ర గ్రంథులమీది కాలేజముయొక్క వపను తీసి యెహోవాకు హోమము చేయవలెను.

11. యాజకుడు బలి పీఠముమీద దానిని దహింపవలెను. అది యెహోవాకు హోమరూపమైన ఆహారము.

12. అతడు అర్పించునది మేక యైనయెడల యెహోవా సన్నిధికి దానిని తీసికొని రావలెను.

13. తాను దాని తలమీద చెయ్యి ఉంచి ప్రత్య క్షపు గుడారము నెదుట దానిని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠముచుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను.

14. తాను దానిలో అర్పించు ఆంత్రములను కప్పు క్రొవ్వును ఆంత్రములమీది క్రొవ్వు అంతటిని

15. రెండు మూత్ర గ్రంథులను వాటిమీది డొక్కలపైనున్న క్రొవ్వును రెండు మూత్ర గ్రంథులపైనున్న కాలేజముయొక్క వపను యెహోవాకు హోమముగా అర్పింపవలెను.

16. యాజకుడు బలిపీఠముమీద వాటిని దహింప వలెను. క్రొవ్వంతయు యెహోవాదే; అది సువాసనగల హోమ రూపమైన ఆహారము. మీరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు.

17. అది మీ తరతరములకు మీ నివాసస్థలములన్నిటిలోను నిత్యమైన కట్టడ.

About లేవీయకాండము Chapter 3

Read లేవీయకాండము Chapter 3 online from the Holy Bible. This chapter is part of the Book of లేవీయకాండము in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: లేవీయకాండము
Chapter: 3
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading లేవీయకాండము. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading లేవీయకాండము Chapter 3 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is లేవీయకాండము Chapter 3?

లేవీయకాండము Chapter 3 is part of the Book of లేవీయకాండము in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete లేవీయకాండము Chapter 3 online for free with easy chapter navigation.

More Chapters from పాత నిబంధన

  1. దానియేలు Chapter 10
  2. సామెతలు Chapter 4
  3. నిర్గమకాండము Chapter 1
  4. జెకర్యా Chapter 4
  5. ఆదికాండము Chapter 1
  6. విలాపవాక్యములు Chapter 3
  7. నెహెమ్యా Chapter 6

Explore More from లేవీయకాండము

  1. లేవీయకాండము Chapter 26
  2. లేవీయకాండము Chapter 13
  3. లేవీయకాండము Chapter 24
  4. లేవీయకాండము Chapter 9
  5. లేవీయకాండము Chapter 8
  6. లేవీయకాండము Chapter 21
  7. లేవీయకాండము Chapter 23

Related Chapters & Readings

  1. కీర్తనలు Chapter 51
  2. రోమీయులకు Chapter 7
  3. హెబ్రీయులకు Chapter 12
  4. 1 రాజులు Chapter 11
  5. యోబు Chapter 3
  6. ఎఫెసీయులకు Chapter 4
  7. 1 సమూయేలు Chapter 22
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *