ఎజ్రా Chapter 1

For English

Read ఎజ్రా Chapter 1 Online

Read ఎజ్రా Chapter 1 online from the Holy Bible. This chapter is part of the Book of ఎజ్రా in the Old Testament. Browse every verse with easy chapter navigation, continue to the next chapter, or explore the complete Book of ఎజ్రా and the Holy Bible online.

Choose a Chapter

ఎజ్రా 1

అధ్యాయం 1

1. పారసీకదేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు యిర్మీయాద్వారా పలుకబడిన తన వాక్య మును నెరవేర్చుటకై యెహోవా పారసీకదేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమం దంతట చాటింపుచేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను

2. పారసీకదేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించునదేమనగాఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశముచేసి, యూదాదేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు.

3. కావున మీలో ఎవరు ఆయన జనులైయున్నారో వారు యూదాదేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి, యెరూషలేములోని దేవుని మందిరమును, అనగా ఇశ్రా యేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను; వారి దేవుడు వారికి తోడైయుండునుగాక.

4. మరియు యెరూషలేములోనుండు దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక ఆ యా స్థలములలోనివారు తమ యొద్ద నివసించువారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలెనని ఆజ్ఞాపించెను.

5. అప్పుడు యూదా పెద్దలును, బెన్యామీనీయుల పెద్దలును, యాజకులును లేవీయులును ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించెనో వారందరు వారితో కూడుకొని వచ్చి, యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి.

6. మరియు వారి చుట్టు నున్న వారందరును స్వేచ్ఛగా అర్పించినవి గాక, వెండి ఉపకరణములను బంగారును పశువులను ప్రశస్తమైన వస్తు వులను ఇచ్చి వారికి సహాయము చేసిరి.

7. మరియు నెబు కద్నెజరు యెరూషలేములోనుండి తీసికొని వచ్చి తన దేవ తలయొక్క గుడియందుంచిన యెహోవా మందిరపు ఉప కరణములను రాజైన కోరెషు బయటికి తెప్పించెను.

8. పారసీకదేశపు రాజైన కోరెషు తన ఖజానాదారుడైన మిత్రిదాతుద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్క చేయించి, యూదులకు అధిపతియగు షేష్బజ్జరు చేతికి అప్పగించెను.

9. వాటియొక్క లెక్క ముప్పది బంగారపు పళ్లెములును వెయ్యి వెండి పళ్లెములును ఇరువది తొమి్మది కత్తులును

10. ముప్పది బంగారుగిన్నెలును నాలుగువందలపది వెండితో చేయబడిన రెండవ రకమైన గిన్నెలును, మరి యితరమైన ఉపకరణములును వెయ్యియై యుండెను.

11. బంగారు వస్తువులును వెండి వస్తువులును అన్నియు అయిదువేల నాలుగు వందలు. షేష్బజ్జరు బబులోనుచరలోనుండి విడిపింపబడినవారితో కూడ కలిసి వీటన్నిటిని యెరూషలేమునకు తీసికొని వచ్చెను.

About ఎజ్రా Chapter 1

Read ఎజ్రా Chapter 1 online from the Holy Bible. This chapter is part of the Book of ఎజ్రా in the Old Testament. Continue reading with the chapter navigation above or explore the complete book.

Book Information

Book: ఎజ్రా
Chapter: 1
Testament: Old Testament

How to Read this Chapter

Use the Previous and Next Chapter buttons to continue reading ఎజ్రా. You can also adjust the font size for comfortable reading and browse other books of the Bible using the navigation links.

https://www.youtube.com/watch?v=rzsT_Q3KLzE

More Resources

Continue Reading the Bible

Continue reading ఎజ్రా Chapter 1 and explore every book, chapter and verse of the Holy Bible. Use the navigation links above and below to move through the Scriptures with ease.

Frequently Asked Questions

What is ఎజ్రా Chapter 1?

ఎజ్రా Chapter 1 is part of the Book of ఎజ్రా in the Holy Bible.

Can I read this chapter online?

Yes. You can read the complete ఎజ్రా Chapter 1 online for free with easy chapter navigation.

More Chapters from ఎజ్రా

  1. ఎజ్రా Chapter 3
  2. ఎజ్రా Chapter 6
  3. ఎజ్రా Chapter 2
  4. ఎజ్రా Chapter 10
  5. ఎజ్రా Chapter 8
  6. ఎజ్రా Chapter 5
  7. ఎజ్రా Chapter 7

Explore More from పాత నిబంధన

  1. కీర్తనలు Chapter 145
  2. యెషయా Chapter 35
  3. కీర్తనలు Chapter 48
  4. 1 రాజులు Chapter 14
  5. ఆమోసు Chapter 8
  6. 2 రాజులు Chapter 25
  7. కీర్తనలు Chapter 140

Related Chapters & Readings

  1. ఎజ్రా Chapter 9
  2. అపొస్తలుల కార్యములు Chapter 24
  3. 1 సమూయేలు Chapter 20
  4. యోబు Chapter 40
  5. నహూము Chapter 3
  6. యోబు Chapter 41
  7. 1 పేతురు Chapter 5
Share Your Love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *